Director Sukumar | ఆర్య కథ రిజెక్ట్ చేసిన ప్రభాస్ – వీవీ వినాయక్ అసిస్టెంట్‌గా వర్క్ – సుకుమార్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
డైరెక్టర్ సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్యలో హీరోగా మొదటి ఛాయిస్ అల్లు అర్జున్ కాదు. రవితేజ, నితిన్‌తో పాటు ప్రభాస్‌లతో చేయాలనుకున్నారు. ఆర్య కంటే ముందు దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు సుకుమార్.
Entertainment | Published On Jan 11, 2026, 6.15 pm IST
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి తర్వాత స్థానం సుకుమార్‌దే. తెలుగు కమర్షియల్ సినిమాను కొత్త అర్థం చెప్పారాయన. సుకుమార్ సినిమాల్లో హీరోలు ఎంత స్టైలిష్‌గా ఉంటారో ఆయన కథలు అంత ఇంటలెక్చువల్‌గా సాగుతాయి. రంగస్థలం లాంటి రా అండ్ రస్టిక్ కథలతోనే కాకుండా నాన్నకు ప్రేమలో లాంటి మోడ్రన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి వెర్సటైల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. సుకుమార్ ఫ్లాప్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు.
1500 జీతం...
సినిమాల్లోకి రాకముందు చాలా కాలం పాటు సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. సినిమాలపై ఇంట్రెస్ట్‌గా ఉద్యోగాన్ని వదిలివేశారు. ఎడిటర్ మోహన్ వద్ద 1500 రూపాయల జీతంతో మనసిచ్చి చూడు సినిమాకు అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలో సుకుమార్ కెరీర్ మొదలైంది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు.
దిల్ సినిమాకు అసిస్టెంట్...
అదే టైమ్‌లో వీవీ వినాయక్‌కు దిల్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. వినాయక్ తమ్ముడు విజయ్...సుకుమార్‌కు మంచి స్నేహితుడు. విజయ్ రికమండేషన్‌తో దిల్ సినిమాకు వినాయక్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సినిమా షూటింగ్‌లోనే దిల్‌రాజుకు ఆర్య కథను చెప్పారు సుకుమార్.
ఆర్య అంత ఈజీగా సెట్స్‌పైకి రాలేదు. ఆర్య కాకుండా ఓ తమిళ రీమేక్ సినిమా చేయమని సుకుమార్‌కు దిల్‌రాజు ఆఫర్ ఇచ్చారు. కానీ తాను స్ట్రెయిట్ సినిమానే చేస్తానని సుకుమార్ పట్టుపట్టారు.
ప్రభాస్ రిజెక్ట్...
ఆర్య కథను అల్లు అర్జున్ కంటే ముందు నితిన్, రవితేజతో పాటు ప్రభాస్‌కు వినిపించారు. ఈ ముగ్గురు రిజెక్ట్ చేశారు. దిల్ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో అక్కడితో అతడికి ఆర్య కథను వినిపించారు సుకుమార్.
ఆర్య మూవీకి మొదట సుకుమార్ నచికేత అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ జనాలకు కనెక్ట్ కాదని ఆర్యగా మార్చేశారు దిల్‌రాజు.
అల్లు అరవింద్‌కు కూడా ఆర్య కథ మొదట నచ్చలేదట. చాలా మార్పులు చేర్పులు చేసి ఆయన్ని ఒప్పించినట్లు సమాచారం. చివరకు ఎన్నో తంటాలు పడి సుకుమార్ ఈ సినిమా చేశారు. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 16 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఆర్య బ్లాక్‌బస్టర్‌తో సుకుమార్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.
ఆర్య విషయంలోనే కాదు సెకండ్ మూవీ జగడంలో ఇలాంటి ట్విస్ట్‌లే ఎదురయ్యాయి. జగడం మూవీ కథను మహేష్‌బాబు కోసం రాసుకున్నారు సుకుమార్. మహేష్‌తో సినిమా చేయడం కుదరకపోవడంతో బన్నీతో చేయాలని అనుకున్నారు. నిర్మాతలు కండీషన్లు పెట్టడంతో కోపంగా రామ్ పోతినేనితో సినిమా చేశారు సుకుమార్.
సంబంధిత వార్తలు

anirudh | అల్లు అర్జున్ సినిమాకు అనిరుధ్ షాకింగ్ రెమ్యూనరేషన్ – రెహమాన్‌ను దాటేశాడుగా!
మే 3, 2026

Ram Charan | రంగస్థలం కాంబో రిపీట్ – రామ్‌చరణ్, సుకుమార్ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఏప్రిల్ 30, 2026

Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ పుష్ప 2 లాభాలపై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ పోస్ట్
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



