త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lenin Teaser | మ‌నోడు వ‌స్తున్నాడు – ర‌గ్గ్‌డ్ లుక్‌లో అఖిల్ – లెనిన్ టీజ‌ర్ రిలీజ్‌

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న లెనిన్ మూవీ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. అఖిల్‌, భాగ్య‌శ్రీ బోర్సే కెమిస్ట్రీ, రొమాంటిక్ డైలాగ్స్ ఈ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ముర‌ళీ కృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On May 23, 2026, 3.26 pm IST

Lenin Teaser | మ‌నోడు వ‌స్తున్నాడు – ర‌గ్గ్‌డ్ లుక్‌లో అఖిల్ – లెనిన్ టీజ‌ర్ రిలీజ్‌
Advertisement

Lenin Teaser |  టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో న‌ల‌భై ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భాన్ని పూర్తి చేసుకొని నాగార్జున త‌న‌యుడు అఖిల్ హీరోగా న‌టిస్తోన్న లెనిన్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి నాగార్జున స్వ‌యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 26న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఎన్టీఆర్ డైలాగ్‌తో...

పౌరాణిక గెట‌ప్‌లో భాగ్య‌శ్రీ బోర్సే క‌నిపిస్తూ సీనియ‌ర్ ఎన్టీఆర్ ..ఏమంటివి ఏమంటివి అనే ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగ్ చెప్పే సీన్‌తోనే ఈ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. అఖిల్‌, భాగ్య‌శ్రీ బోర్సే కెమిస్ట్రీ, వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్‌ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. 'మనోడు వస్తున్నాడు....‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన’ అంటూ అఖిల్ చెప్పిన‌ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. చిత్తూరు యాసలో అఖిల్  సంభాష‌ణ‌లు, అత‌డి బాడీ లాంగ్వేజ్, రగ్గ్‌డ్ లుక్ కొత్త‌గా ఉన్నాయి. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో అఖిల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ఈ టీజ‌ర్‌లో చూపించారు. అఖిల్‌, భాగ్య‌శ్రీ బోర్సే, శివాజీతో పాటు మిగిలిన పాత్ర‌ధారుల డైలాగ్స్ కూడా చిత్తూరు యాస‌లోనే నాచుర‌ల్‌గా సాగాయి.

త‌మ‌న్ మ్యూజిక్‌....

లెనిన్‌లో శివాజీ, శ‌ర‌ణ్య‌, గెట‌ప్ శీను, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. పీరియాడిక‌ల్ విలేజ్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత అఖిల్ హీరోగా న‌టిస్తోన్న మూవీ ఇది. చివ‌ర‌గా 2023లో రిలీజైన ఏజెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో సినిమాల‌కు బ్రేక్ తీసుకున్నాడు. లెనిన్ స‌క్సెస్ అఖిల్‌కు కీల‌కంగా మారింది.

Advertisement
Advertisement