Tollywood | పెద్దికి కూడా మినహాయింపు లేదు – పర్సెంటేజీ సిస్టమ్‌పై తగ్గేదేలే అంటోన్న ఎగ్జిబిటర్లు
టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, తెలంగాణ ఎగ్జిబిటర్లకు మధ నడుస్తోన్న పర్సెంటేజీ సిస్టమ్ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ పర్సెంటేజీ రెవెన్యూ షేరింగ్ నుంచి రామ్‌చరణ్ పెద్దికి కూడా మినహాయింపు ఇచ్చేది లేదని నైజాం ఎగ్జిబిటర్లు తీర్మాణించారు. రెవెన్యూ షేరింగ్ అంగీకరిస్తేనే సింగిల్ స్క్రీన్స్‌లో పెద్దిని రిలీజ్ చేస్తామని అన్నారు.
Entertainment | Published On May 23, 2026, 5.18 pm IST
Tollywood | పర్సెంటేజీ షేరింగ్ విధానంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, తెలంగాణ ఎగ్జిబిటర్లకు మధ్య మొదలైన వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు. పర్సెంటేజీ సిస్టమ్ అమలు నుంచి రామ్‌చరణ్ పెద్దికి కూడా మినహాయింపు ఇవ్వమని అన్నారు. రెవెన్యూ షేరింగ్‌కు అంగీకరించిన సినిమాలనే తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.
మినహాయింపు లేదు...
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నైజాం ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. "పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడే పర్సంటేజీ విధానం అమలు చేయమని నిర్మాతలను కోరాము. కానీ తాము ఇబ్బందుల్లో ఉన్నామని నిర్మాతలు చెబితే సానుకూల దృక్పథంతో ఆగిపోయాం. అప్పటి నుంచి మా డిమాండ్‌ను తరచుగా వినిపిస్తూనే వస్తున్నాం. అదిగో ఇదిగో అంటూ మా సమస్యలను పట్టించుకోకుండా పర్సెంటేజీ సిస్టమ్‌ను వాయిదావేస్తూ వచ్చారు నిర్మాతలు. ఇప్పుడు పెద్దిని వదిలేసి మరో సినిమా నుంచి చూద్దాం అని అంటున్నారు. మూడు వారాలు సమయం కావాలంటూ సమస్యను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆగేది లేదు. పెద్ది సినిమాను కూడా పర్సెంటేజీ విధానంలోనే రిలీజ్ చేయాలి. మాకు రెవెన్యూలో ఎంత షేర్ ఇస్తారో కూడా నిర్మాతలు చెప్పాలి. పర్సెంటేజ్ సిస్టమ్‌కు అంగీకరిస్తేనే పెద్దితో పాటు మిగిలిన భారీ బడ్జెట్ సినిమాలను తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్‌లో విడుదల చేస్తాం. లేదంటే రిలీజ్ చేయం" అని అని ఎగ్జిబిటర్లు ఈ మీటింగ్‌లో పేర్కొన్నారు.
పెద్దికి తెలంగాణ టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదని ఎగ్జిబిటర్ల చెప్పారు. సినిమా టికెట్ రేట్లను పెంచొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని అన్నారు.
పెద్ది రిలీజ్ ఉంటుందా?
ఎగ్జిబిటర్ల డిమాండ్‌తో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్స్‌లో పెద్ది రిలీజ్ కావడం అనుమానంగా మారింది. పెద్ది రిలీజ్‌కు మరో పది రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈ లోగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత నాలుగైదు నెలలుగా కొనసాగుతోన్న ఈ సమస్య పది రోజుల్లో సాల్వ్ కావడం కూడా కష్టమే. ఒకవేళ ఎగ్జిబిటర్ల డిమాండ్‌కు నిర్మాత అంగీకరించకపోతే పెద్ది సందడిని సింగిల్ స్క్రీన్స్‌లో ఫ్యాన్స్ మిస్సయినట్లే. ఓపెనింగ్స్‌పై కూడా గట్టిగానే ప్రభావం పడుతుంది.
తెలంగాణ ఛాంబర్ నిర్మాతగా...
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావు ఎన్నికయ్యారు. శనివారం జరిగిన మీటింగ్‌లోనే శేఖర్‌రావును అధ్యక్షుడిగా ఎన్నుకొంటూ ఛాంబర్ సభ్యులు తీర్మాణం చేశారు. ఇటీవలే ఈ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం
- ●Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్
- ●Mouni Roy | తల్లి వయసు 40 - కొడుక్కి 39 ఏళ్లు - మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజన్ల ట్రోల్
- ●Ameenpur | అమీన్పూర్లో వ్యక్తి అరెస్ట్.. 45 తులాల ఆభరణాలకు బాధితులకు అప్పగించిన పోలీసులు
- ●Allu Arjun | ఐకాన్ స్టార్‌ను కలిసిన ఆర్సీబీ క్రికెటర్ - ఫొటోలు వైరల్
- ●Renukaswami Case | జైలులో హీరో దర్శన్ ఆత్మహత్య ప్రయత్నం అంటూ వార్తలు.. ఖండించిన హోం మంత్రి..!

HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం

Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్

Mouni Roy | తల్లి వయసు 40 - కొడుక్కి 39 ఏళ్లు - మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజన్ల ట్రోల్

Ameenpur | అమీన్పూర్లో వ్యక్తి అరెస్ట్.. 45 తులాల ఆభరణాలకు బాధితులకు అప్పగించిన పోలీసులు




