Prabhas | లెంగ్తీ రన్‌టైమ్‌తో రాజాసాబ్ – ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా?
Prabhas | రాజాసాబ్ మూవీతో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నారు ప్రభాస్. ఈ హారర్ కామెడీ మూవీ రన్‌టైమ్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. దాదాపు మూడు గంటల పది నిమిషాల రన్‌టైమ్‌తో ఈ రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Dec 16, 2025, 7.23 pm IST
ప్రభాస్
Prabhas |రాజాసాబ్ మూవీతో సంక్రాంతి బరిలో నిలిచారు రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas). హారర్ కామెడీగా రూపొందిన ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాజాసాబ్‌తో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌ను ప్రభాస్ టచ్ చేస్తుండటం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్, ట్రైలర్‌తో పాటు ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి.
రాజాసాబ్ (Rajasaab) సెకండ్ సింగిల్‌ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారు. సహానా అనే ఈ లిరికల్ వీడియో తాలూకు ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్‌గా ఈ ప్రోమో సాగింది. ప్రభాస్ స్టెప్పులతో పాటు లిరిక్స్, విజువల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ రెబెల్ సాబ్‌పై విమర్శలు వచ్చాయి. ఈ ట్రోల్స్‌కు సహానా సాంగ్‌తో బదులు ఇవ్వాలనే ప్రయత్నంలో రాజాసాబ్ టీమ్ ఉంది.
ఓ వైపు ప్రమోషన్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో రాజాసాబ్ టీమ్ ఫుల్ బిజీగా ఉంది. రాజాసాబ్ ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యిందట. మూడు గంటల పది నిమిషాలను ఫైనల్ రన్‌టైమ్‌గా మేకర్స్ లాక్ చేశారట.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే లాంగెస్ట్ రన్‌టైమ్‌తో రిలీజ్ కానున్న ఫస్ట్ హారర్ కామెడీ మూవీగా రాజాసాబ్ నిలవనుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ప్రభాస్ కెరీర్‌లో లెంగ్తీ రన్‌టైమ్ తో కూడిన సినిమాల్లో ఒకటిగా రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గంటల రన్ టైమ్ ట్రెండ్...
ప్రస్తుతం మూడు గంటల రన్ టైమ్ అన్నది ట్రెండ్ కావచ్చు కానీ....హారర్ కామెడీ సినిమాకు మాత్రం లెంగ్తీ రన్ టైమ్ అంటే రిస్క్ చేస్తున్నట్లేనని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. సాధారణంగా హారర్ కామెడీ సినిమాల రన్‌టైమ్ రెండున్నర గంటలు మించడం అరుదు. అలాంటిది మూడు గంటలకుపైగా రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్లలో కూర్చోబెట్టడం అంటే సవాలే. మరి ఈ ఛాలెంజింగ్‌లో మారుతి అండ్ టీమ్ ఎంత వరకు పాస్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
క్రిస్పీ రన్‌టైమ్‌తో ప్రభాస్ ఇమేజ్, స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా రాజాసాబ్ కథను చెప్పడం కష్టమైందట. రన్‌టైమ్ తగ్గిస్తే కథలోని ఫ్లో దెబ్బతినే అవకాశం ఉండటంతో మూడు గంటల పది నిమిషాల నిడివిని లాక్ చేశారట. రిలీజ్ డేట్ లోగా రన్ టైమ్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ అవుతారా? అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అన్నది చూడాల్సిందే.
రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 400 కోట్లతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026

Sai Pallavi | సాయిపల్లవి కారణంగా ప్రభాస్ కల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ – అసలేమైందంటే?
మే 5, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



