త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి మ‌రో షాక్‌.. కేబుల్ టీవీలో ప్ర‌సార‌మైన‌ జ‌న‌నాయ‌గ‌న్‌

Jana Nayagan | త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ (Jana Nayagan) సినిమాను క‌ష్టాలు వీడ‌టం లేదు. గ‌త‌వారం ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా కేబుల్ టీవీలోనే (Cable TV) ప్ర‌సార‌మైంది.

G

Movies | Published On Apr 14, 2026, 6.59 am IST

Jana Nayagan | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి మ‌రో షాక్‌.. కేబుల్ టీవీలో ప్ర‌సార‌మైన‌ జ‌న‌నాయ‌గ‌న్‌
Advertisement

Jana Nayagan | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ (Jana Nayagan) సినిమాను క‌ష్టాలు వీడ‌టం లేదు. గ‌త‌వారం ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా కేబుల్ టీవీలోనే (Cable TV) ప్ర‌సార‌మైంది. ఆన్‌లైన్‌లో లీకైన ఫుటేజీని త‌మిళ‌నాడు కోయంబ‌త్తూరులో రాశి కేబుల్ నెట్‌వ‌ర్క్‌ను నిర్వ‌హిస్తున్న ప‌ళ‌నిస్వామి స్వామి అనే వ్య‌క్తి టీవీలో ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సిన జ‌న‌నాయ‌గ‌న్‌.. సెన్సార్ స‌ర్టిఫికెట్ వివాదం కార‌ణంగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న‌ది. విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పైరసీ జరగడం నిర్మాతలను కోలుకోలేని విధంగా దెబ్బ‌తీసింది. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో లీక్ వ్య‌వ‌హారంపై నిర్మాణ సంస్థ కెవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జననాయగన్‌ మూవీ లీక్‌ కారణమైన ఆరుగురిని తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు టెలిగ్రామ్ ద్వారా హై డెఫినిషన్ ప్రింట్‌ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి, పంపిణీ చేసిన ఒక సమన్వయ పైరసీ నెట్‌వర్క్‌లో భాగమని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

జననాయగన్‌ సినిమా నుంచి లీకైన సీన్‌లను ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేసినా చర్యలు తీసుకుంటామని చిత్ర యూనిట్‌కు చెందిన లాయర్ హెచ్చరించారు. సినిమాను లీక్‌ చేసిన ఆరుగురిని సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే అరెస్టు చేసిందన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement