Jana Nayagan | దళపతి విజయ్ జననాయగన్ సెన్సార్ కష్టాలకు శుభంకార్డు? – రిలీజ్ అప్పుడేనా…
జననాయగన్ సెన్సార్ వివాదం మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది. సోమవారం రోజు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రావచ్చునని టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సస్పెన్స్ నెలకొంది.
Entertainment | Published On Apr 27, 2026, 7.13 pm IST
Jana Nayagan | దళపతి విజయ్ జననాయగన్ మూవీ సెన్సార్ సమస్యలు సీరియల్‌గా సాగుతూనే ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ సెన్సార్ అభ్యంతరాల కారణంగా వాయిదాపడింది. ఈ వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చేరుకుంది. అయినా సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కూడా నిర్మాతలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. సెన్సార్ బోర్డ్‌తోనే వివాదం తేల్చుకోమని చెప్పింది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం గత మూడు నెలలుగా నిర్మాతలు ఎదురుచూస్తునే ఉన్నారు.
ఏప్రిల్ 24...
సీబీఎఫ్‌సీ సూచనల మేరకు జననాయగన్‌లోని పొలిటికల్ డైలాగ్స్, విజయ్ రాజకీయ అరంగేట్రం కోసం సిద్ధం చేసిన సన్నివేశాలను తొలగించడానికి చిత్ర బృందం అంగీకరించిందట. వివాదం చివరి దశకు వచ్చిందని, ఏప్రిల్ 24న సెన్సార్ నుంచి క్లియరెన్స్ రావచ్చునని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. కానీ రివైజింగ్ కమిటీ మాత్రం చివరి నిమిషంలో ఓ మెలిక పెట్టిందట. జననాయగన్‌ను మరోసారి చూసిన తర్వాతే సర్టిఫికెట్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తామని అన్నారట.సోమవారం రోజు జననాయగన్ సినిమాను రివైజింగ్ కమిటీ మరోసారి చూడబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రోజు మిడ్‌నైట్‌లోపు దళపతి విజయ్ సినిమా రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చునని అంటున్నారు.
ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాతే..
సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చినా సినిమా రిలీజ్ మాత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతే ఉంటుందట. మే 7 లేదా మే 14లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లతో పాటు కొందరు నిర్మాతలు మాత్రం మే నెలాఖరున ఈ సినిమాను రిలీజ్ చేయడం మంచిదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సూర్య, ధనుష్ సినిమాలు...
ఏప్రిల్ 30న ధనుష్ కర, మే 14న సూర్య కరుప్పు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. జననాయగన్ థియేటర్లలోకి వస్తే ఈ రెండు సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సూర్య, ధనుష్ సినిమాలకు థియేటర్ల సమస్య కూడా ఎదురవుతుంది. చాలా రోజుల క్రితమే కర, కరుప్పు సినిమాల విడుదల తేదీలను నిర్మాతలు అనౌన్స్‌చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లతో డీల్ చేసుకున్నారు. ఈ సినిమాల రిలీజ్ డేట్ మార్చడం కష్టం కావడంతో జననాయగన్ నిర్మాతనే రాజీ పడితే మంచిదని వారు చెబుతోన్నారు.
సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినా మే నెలాఖరు వరకు ఈ సినిమా రిలీజ్ ఉండకపోవచ్చుననే కామెంట్లు వినిపిస్తున్నాయి. మే 27ను విడుదల తేదీగా ఫైనల్ చేయవచ్చనని చెబుతున్నారు.
పూజా హెగ్డే...
జననాయగన్ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్ర పోషించింది. తెలుగులో సూపర్ హిట్టైన బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్‌గా జననాయగన్ రూపొందింది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



