Prabhas | రెబెల్ స్టార్ ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఇవే – ఒక్కోటి చాలా కాస్ట్‌లీ
ప్రభాస్‌కు సినిమాలతో పాటు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టమట. అతడి దగ్గర లంబోర్గినీ, రోల్స్ రాయిస్‌తో పాటు పలు కాస్ట్‌లీ కార్లు ఉన్నాయి. లంబోర్గినీ అవెంటడార్ కారు కలిగిన ఏకైన దక్షిణాది సెలిబ్రిటీ ప్రభాస్ కావడం గమనార్హం.
Entertainment | Published On Jan 9, 2026, 4.39 pm IST
Prabhas | ఇండియాలనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్నారు ప్రభాస్. రెబెల్‌స్టార్ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్‌లు షేక్ అవ్వాల్సిందే. టాలీవుడ్ హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ప్రభాస్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. తన రికార్డులు తానే బ్రేక్ చేయడం తప్పితే ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేసిన హీరోలు మాత్రం లేరు.
ఇండియన్ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్ రియల్‌లైఫ్‌లో మాత్రం సింప్లిసిటీకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. అదే అతడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. సినిమాలు కాకుండా ప్రభాస్‌కు డ్రైవింగ్ అంటే ఇష్టమట. ప్రభాస్ గ్యారేజీలో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి.
లంబోర్గినీ
ప్రభాస్ దగ్గర ఉన్న కాస్ట్‌లీ కార్లలో లంబోర్గినీ అవెంటడార్ ఒకటి. ఈ సూపర్ కార్ కలిగిన ఏకైక దక్షిణాది స్టార్ ప్రభాస్ ఒక్కరే కావడం గమనార్హం. లంబోర్గినీ కారు ఖరీదు ఆరు కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. ఈ లంబోర్గినీ కారుతో పలుమార్లు అభిమానులకు కనిపించారు ప్రభాస్. గంటకు 350 కిలో మీటర్ల వేగంతో వెళ్లే కెపాసిటీ ఈ కారుకు ఉంది. మూడు సెకండ్ల వ్యవధిలోనే వంద స్పీడును అందుకోగలడం ఈ కారు ప్రత్యేకతగా చెబుతుంటారు.
రోల్స్ రాయిస్ ఫాంథమ్...
లంబోర్గినీ కంటే ముందు రోల్స్ రాయస్ ఫాంథమ్ కారును కొనుగులు చేశారు ప్రభాస్. ఈ హై ఎండ్ మోడల్ కారు ధర ఇంచుమించు పది కోట్ల వరకు ఉంటుందని టాక్. ప్రభాస్ దగ్గర ఉన్న అత్యంత కాస్ట్‌లీ కారు ఇదే.
రేంజ్ రోవర్...
ప్రభాస్ దగ్గర రేంజ్ రోవర్ ఎస్‌యూవీ మోడల్ కారు ఉంది. ఈ లగ్జరీ కారును 2023లో కొనుగోలు చేశారు. ఈ కారు ధర నాలుగునున్నర కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా జాగ్వర్ ఎక్స్‌జే, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5, ఎక్స్ 3 కార్లు కూడా ప్రభాస్ గ్యారేజీలో ఉన్నాయి. టాలీవుడ్‌లో అంత్యత ఖరీదైన కార్లు కలిగిన సెలిబ్రిటీలలో ప్రభాస్ ముందున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రాజాసాబ్‌తో పాటు స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026

Sai Pallavi | సాయిపల్లవి కారణంగా ప్రభాస్ కల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ – అసలేమైందంటే?
మే 5, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



