త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్యార‌డైజ్ సినిమా చూడ‌బోతున్న కేటీఆర్ – చాలా ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్‌

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ది ప్యార‌డైజ్ మూవీ రెండు రోజుల్లోనే 114 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోన్న ఈ మూవీని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూడ‌బోతున్నారు. శ‌నివారం రాత్రి ప్యార‌డైజ్ మూవీని థియేట‌ర్‌లో వీక్షించ‌నున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ పెట్టారు.

N

Entertainment | Published On Sep 26, 2026, 1.26 pm IST

KTR | ప్యార‌డైజ్ సినిమా చూడ‌బోతున్న కేటీఆర్ – చాలా ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్‌
Advertisement

KTR | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్యార‌డైజ్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 114 కోట్ల  క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అణిచివేత‌కు గురైన స‌వారీ జాతి క‌థ‌తో త‌ల్లీకొడుకుల ఎమోష‌న్‌, యాక్ష‌న్ అంశాలు మేళ‌వించి ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెర‌కెక్కించారు. నాని, మోహ‌న్‌బాబు న‌ట‌న‌, శ్రీకాంత్ టేకింగ్‌, అనిరుధ్ సాంగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

చాలా ఏళ్ల త‌ర్వాత ...

ప్యార‌డైజ్ మూవీని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూడబోతున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స్వ‌యంగా కేటీఆర్ వెల్ల‌డించ‌బోతున్నారు. "చాలా ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్‌కు వెళుతున్నాను. నాకు ఇష్ట‌మైన‌ హీరోల్లో ఒక‌రైన నాని, ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కించిన ది ప్యార‌డైజ్ మూవీని ఈ రోజు రాత్రి చూడబోతున్నా" అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

కేసీఆర్ పాత్ర‌లో...

ప్యార‌డైజ్ మూవీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి క‌నిపించారు. సెకండాఫ్‌లో ఈ సినిమాకు ఈ రోల్ హైలైట్‌గా నిలిచింది. మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్ డెలివ‌రీలో కేసీఆర్‌ను త‌ల‌పించారు ప్రియ‌ద‌ర్శి. అత‌డి పాత్ర‌కు సంబంధించిన డైలాగ్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ సినిమా చూడ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలంగాణ అంశాల‌తో...

కేసీఆర్ పాత్ర‌ను మాత్ర‌మే కాకుండా తెలంగాణ అంశాల‌ను సినిమాలో చాలానే ట‌చ్ చేశారు డైరెక్టర్. ప్ర‌ధాన పాత్ర‌ధారుల డైలాగ్స్ హీరోతో పాటు అత‌డి త‌ల్లి పేరును స‌మ్మ‌క్క‌, సార‌క్క అంటూ పెట్ట‌డం, మోహ‌న్‌బాబు పాత్ర‌ను నిజాం పాల‌న‌తో పోల్చ‌డం, ప్రత్యేక రాష్ట్ర పోరాటం తో పాటు ప‌లు తెలంగాణ నేప‌థ్య అంశాల‌తో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరుకు ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

Advertisement
Advertisement