Nupur Sanon | మహేష్ బాబు హీరోయిన్‌కు షాక్ – అక్క కంటే ముందే పెళ్లి కబురు వినిపించిన చెల్లి
రవితేజ టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ నుపుర్ సనన్ పెళ్లి చేసుకోబోతుంది. బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్‌తో నుపుర్ సనన్ పెళ్లి జనవరి 11న జరుగనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Dec 26, 2025, 10.53 am IST
Nupur Sanon
Nupur Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్‌కు ఆమె చెల్లి నుపుర్ సన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. కృతి సనన్ కంటే ముందే నుపుర్ సనన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్‌తో నుపుర్ సనన్ ఏడుడుగుల వేయనుంది. స్టెబిన్ బెన్, నుపుర్ సనన్ 2023 నుంచి ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
జనవరి 11న స్టెబిన్ బెన్, నుపుర్ సనన్ పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగనుందట. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులకే ఆహ్వానం అందినట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.
రవితేజ సినిమాలో హీరోయిన్....
నుపుర్ సనన్ తెలుగులో కూడా ఓ సినిమా చేసిందండోయ్. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తొలి సినిమాలో గ్లామర్‌తో మెప్పించింది. టైగర్ నాగేశ్వరరావు పరాజయాంతో ఈ అమ్మడికి మరో అవకాశం రాలేదు. డెబ్యూ మూవీనే చివరి సినిమా అయ్యింది.పాప్ కౌన్ పేరుతో హిందీలో రెండేళ్ల క్రితం ఓ వెబ్‌సిరీస్ చేసింది. అది కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం నూరానీ చెహ్రా పేరుతో ఓ సినిమా చేస్తోంది. హిందీలో నుపుర్ సనన్ చేస్తున్న ఈ ఫస్ట్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.
కృతి సనన్ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె యాక్టింగ్ జర్నీ మాత్రం తెలుగు సినిమాలతోనే మొదలైంది. మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన వన్ నేనొక్కడినే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య తో దోచేయ్ సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో బాలీవుడ్‌కు షిప్టయ్యింది. హిందీలో అదృష్టం కలిసిరావడంతో టాప్ హీరోయిన్‌గా మారింది. అక్క కృతిసనన్ అడుగుజాడల్లోనే చెల్లి నుపుర్ సనన్ ప్రయాణించింది. తెలుగులో మొదలుపెట్టి బాలీవుడ్‌ను ఎలాలని చూసింది. కానీ చెల్లిని మాత్రం బ్యాడ్‌లక్ వెంటాడింది.
ఈ ఏడాది కృతిసనన్ హిందీలో తేరే ఇష్క్ మే సినిమా ఒక్కటే చేసింది. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం కాక్ టెయిల్ 2లో నటిస్తుంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మరో నాయికగా రష్మిక కనిపించబోతున్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Unsuitable Sari | వరుడి కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని.. పెండ్లికి నిరాకరించింది..
మే 14, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



