త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Unsuitable Sari | వ‌రుడి కుటుంబం తెచ్చిన చీర న‌చ్చ‌లేద‌ని.. పెండ్లికి నిరాక‌రించింది..

Unsuitable Sari | సాధార‌ణంగా వ‌రుడు న‌చ్చ‌లేద‌నో, మ‌రొక‌రిని ఇష్ట‌ప‌డుతున్నామ‌నో పెండ్లి ఆగిపోతూ ఉంటుంది. కానీ ఇక్క‌డ వ‌రుడి కుటుంబం తెచ్చిన చీర న‌చ్చ‌లేద‌ని వివాహాన్ని (Unsuitable Sari) ఆపేసింది ఓ వ‌ధువు. దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య గొడవ జ‌ర‌గ‌డం, పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్క‌డం జ‌రిగిపోయాయి.

G

National | Published On May 14, 2026, 6.26 am IST

Unsuitable Sari | వ‌రుడి కుటుంబం తెచ్చిన చీర న‌చ్చ‌లేద‌ని.. పెండ్లికి నిరాక‌రించింది..
Advertisement

Unsuitable Sari | త్రినేత్ర‌.న్యూస్‌: సాధార‌ణంగా వ‌రుడు న‌చ్చ‌లేద‌నో, మ‌రొక‌రిని ఇష్ట‌ప‌డుతున్నామ‌నో పెండ్లి ఆగిపోతూ ఉంటుంది. కానీ ఇక్క‌డ వ‌రుడి కుటుంబం తెచ్చిన చీర న‌చ్చ‌లేద‌ని వివాహాన్ని (Unsuitable Sari) ఆపేసింది ఓ వ‌ధువు. దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య గొడవ జ‌ర‌గ‌డం, పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్క‌డం జ‌రిగిపోయాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) బ‌లియా జిల్లాలో రేవ‌తి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గాయ్‌ఘాట్ గ్రామంలో జ‌రిగింది.

చాప్రా గ్రామానికి చెందిన అజ‌య్ గోండ్ కుమార్తె నికీ వివాహం మ‌హ‌ద‌న్‌పూర్ గ్రామానికి చెందిన ప‌వ‌న్ గోండ్ కుమారుడు విశాల్ గోండ్‌తో నిశ్చ‌య‌మైంది. ఈ నెల 11న గాయ్‌ఘాట్ గ్రామంలోని పంచ్‌రుఖి అమ్మ‌వారి ఆల‌యంలో ఇరువురి పెండ్లి జ‌ర‌గాల్సి ఉన్న‌ది. వ‌రుడు త‌న మందీ మార్బ‌లంతో ఊరేగింపుగా క‌ల్యాణ వేదిక అయిన ఆల‌యానికి చేరుకున్నాడు. అయితే పెండ్లి కూతురు మాత్రం ఎంత‌కూ రావ‌డం లేదు.

వ‌రుడి కుంటుంబం తెచ్చిన చీర దానికి కార‌ణం. త‌న‌కు ఆ చీర న‌చ్చ‌లేద‌ని, క‌ట్టుకోవ‌డానికి నిరాక‌రించింది. అది అన్‌సూట‌బుల్ అంటూ పెండ్లి క్రతువు కొనసాగేందుకు ససేమిరా అంటూ మొండికేసింది. ఇది రెండు కుటుంబాల వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఇరు కుటుంబాలు ఘ‌ర్ష‌ణ దిగారు. ఈ క్ర‌మంలో వ‌ధువు సోద‌రుడు, త‌ల్లి, మ‌రో మ‌హిళ గాయ‌ప‌డ్డారు. వ‌ధువు తండ్రి అజ‌య్ గోండ్ ఫిర్యాదుతో రేవ‌తి పోలీసులు వరుడు విశాల్‌తోపాటు అతడి బంధుమిత్రులపై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్థున్నారు.

Advertisement
Advertisement