Komalee Prasad | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న అచ్చ తెలుగు హీరోయిన్…
అచ్చ తెలుగు బ్యూటీ కోమలి ప్రసాద్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మండవెట్టి పేరుతో ఓ సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
Entertainment | Published On Jan 31, 2026, 5.46 pm IST
Komalee Prasad | కోమలి ప్రసాద్....నెపోలియన్, సెబాస్టియన్‌తో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అడివి శేష్ హిట్ 2తో పాటు నాని హిట్ 3లో పోలీస్ ఆఫీసర్‌గా రఫ్ అండ్ టఫ్ రోల్‌తో మెప్పించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మోడ్రన్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్‌తో పాటు తెలుగులో మరికొన్ని వెబ్‌సిరీస్‌లు చేసి నటిగా సత్తా చాటింది. తాజాగా ఈ అచ్చ తెలుగు బ్యూటీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మండవెట్టి పేరుతో తమిళంలో ఓ సినిమా చేయబోతుంది. సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
రెగ్యులర్ షూటింగ్...
మండవెట్టి మూవీ పూజా కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుపుతున్నారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్టిసిజం అనే కొత్త పాయింట్‌ను ఈ మూవీలో టచ్ చేయబోతున్నారు.
వెల్లకుదిర...
శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ గతంలో వెల్ల కుదిర సినిమాకు దర్శకత్వం వహించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. మండవెట్టి సినిమాలో మరో డిఫరెంట్ పాయింట్ టచ్ చేయబోతున్నారు. ఇందులో తేనప్పన్, గజరాజ్, అమృత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పవర్‌ఫుల్ ఉమెన్ ఓరియెంటెడ్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు.
డాక్టర్...
స్వతహాగా డాక్టర్ అయిన కోమలి ప్రసాద్ నటనపై ఇంట్రెస్టింగ్‌తో యాక్టర్‌గా మారింది. ప్రస్తుతం డెంటల్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే సినిమాలో చేస్తోంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



