త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | అంధురాలిగా కియారా అద్వానీ – య‌శ్ మూవీ కోసం షాకింగ్ రెమ్యూన‌రేష‌న్‌…

య‌శ్ హీరోగా న‌టిస్తోన్న టాక్సిక్ మూవీతో క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీలో కియారా అంధురాలిగా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Mar 2, 2026, 4.00 pm IST

Kiara Advani | అంధురాలిగా కియారా అద్వానీ – య‌శ్ మూవీ కోసం షాకింగ్ రెమ్యూన‌రేష‌న్‌…
Advertisement

Kiara Advani |  బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది కియారా అద్వానీ. ప‌దేళ్ల కెరీర్‌లో చేసింది త‌క్కువ సినిమాలే. కానీ అన్ని డిఫ‌రెంట్ రోల్సే. గ్లామ‌ర్ మాత్ర‌మే కాకుండా యాక్ష‌న్ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్స్‌ కూడా చేయ‌గ‌ల‌ద‌ని వార్ 2 వంటి సినిమాల‌తో నిరూపించుకుంది. బాలీవుడ్‌కే ప‌రిమితం కాకుండా తెలుగులోనూ మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోల‌తో జోడీక‌ట్టింది. తాజాగా టాక్సిక్ మూవీతో సాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ. య‌శ్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

త‌బాహీ సాంగ్‌...

తాజాగా య‌శ్ టాక్సిక్ నుంచి సోమ‌వారం త‌బాహీ అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు సంబంధించి రిలీజ్ చేసిన రొమాంటిక్ పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ పోస్ట‌ర్లు చూస్తుంటే వీరిద్ద‌రి కెమిస్ట్రీ సినిమాలో ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

అంధురాలిగా...

కాగా టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ రోల్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో కియారా అద్వానీ అంధురాలిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌లో ఆమె లుక్, బాడీలాంగ్వేజ్ అంధురాలిని పోలి క‌నిపిస్తోన్నాయి. కియారాది రొమాంటిక్‌తో పాటు యాక్ష‌న్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ అని అంటున్నారు. య‌శ్‌ ల‌వ‌ర్‌గానే కాకుండా స‌ర్క‌స్‌లో విన్యాసాలు చేసే యువ‌తిగా కియారా క‌నిపిస్తుంద‌ట‌. ఈ రోల్ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ర్క‌స్‌ కళాకారుల వద్ద స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంద‌ట కియారా అద్వానీ. రియ‌ల్ స‌ర్క‌స్ క‌ళాకారుల‌ను త‌ల‌పించేలా డూప్ లేకుండా ఈ సీన్ల‌లో కియారా న‌టించింద‌ని టాక్ వినిపిస్తోంది.

ప‌దిహేను కోట్లు...

టాక్సిక్ కోసం కియారా అద్వానీ ప‌దిహేను కోట్ల రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకునే ఈ బ్యూటీ టాక్సిక్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. టాక్సిక్‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న హీరోయిన్ కూడా కియారానేన‌ట‌.ఇందులో కియారా అద్వానీతో పాటు న‌య‌న‌తార‌, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement
Advertisement