త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | మధుబాల బయోపిక్‌లో కియారా అద్వానీ అంటూ ప్రచారం.. వాస్తవం లేదన్న ఇండస్ట్రీ వర్గాలు..!

Kiara Advani | భారతీయ సినీ చరిత్రలో అపూర్వమైన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ నటి మధుబాల (Madhubala) జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి జస్మీత్‌ కె రీన్‌ (Jasmeet K Reen) దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

P

Entertainment | Published On Mar 8, 2026, 12.35 pm IST

Kiara Advani | మధుబాల బయోపిక్‌లో కియారా అద్వానీ అంటూ ప్రచారం.. వాస్తవం లేదన్న ఇండస్ట్రీ వర్గాలు..!
Advertisement

Kiara Advani | భారతీయ సినీ చరిత్రలో అపూర్వమైన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ నటి మధుబాల (Madhubala) జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి జస్మీత్‌ కె రీన్‌ (Jasmeet K Reen) దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఆమె గతంలో డార్లింగ్స్‌ (Darlings) అనే కామెడీ-డ్రామా చిత్రాన్ని తెరకెక్కించి మంచి గుర్తింపు పొందారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. భారీ నిర్మాణాలతో సినిమాలు తెరకెక్కించడంలో భన్సాలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతో ఈ బయోపిక్‌పై ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో మధుబాల సినీ ప్రయాణంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను తెరపై ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఆమె జీవితంలో ప్రాధాన్యం కలిగిన ఇద్దరు వ్యక్తులతో ఉన్న సంబంధాలను కథలో ప్రధానంగా చూపించే అవకాశముంది. అందులో ఒకరు ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌ (Dilip Kumar). మధుబాలతో కలిసి పలు చిత్రాల్లో నటించిన ఆయనతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, 1957లో జరిగిన కోర్టు వివాదంతో ఆ బంధానికి తెరపడింది. అనంతరం మధుబాల ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్‌ కుమార్‌ (Kishore Kumar)ను 1960లో వివాహం చేసుకున్నారు.

ఇక ఈ బయోపిక్‌లో మధుబాల పాత్రను బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ (Kiara Advani) పోషించనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆమె ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. గతంలో మధుబాల పాత్రను పోషించడం తనకు ‘డ్రీమ్‌ రోల్‌’ అని కియారా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ ప్రాజెక్టులో భాగం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా నటిస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదని సమాచారం. కియారా సినిమాల విషయానికి వస్తే, ఆమె చివరిసారిగా వార్‌–2 (War 2) చిత్రంలో కనిపించారు. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం కన్నడ స్టార్‌ యష్‌ (Yash) నటిస్తున్న టాక్సిక్‌ (Toxic) చిత్రంలో కియారా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార (Nayanthara), తారా సుతారియా (Tara Sutaria), హ్యూమా ఖురేషి (Huma Qureshi), రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మధుబాల విషయానికి వస్తే, 1950లలో భారతీయ సినీ రంగంలో ప్రముఖ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎనిమిదేళ్ల వయసులోనే బాలనటిగా సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 1947లో విడుదలైన నీల్‌ కమల్‌ (Neel Kamal) చిత్రంతో 14 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం మొఘల్‌-ఏ-ఆజమ్‌ (Mughal-e-Azam), మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55 (Mr. & Mrs. 55), చల్తీ కా నామ్‌ గాడీ (Chalti Ka Naam Gaadi), హౌరా బ్రిడ్జ్‌ (Howrah Bridge) వంటి చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఆ సమయంలో ఆమెకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నవారు ముగ్గురు హీరోలు మాత్రమే. అందులో దిలీప్‌ కుమార్‌, రాజ్‌ కపూర్‌ (Raj Kapoor), దేవ్‌ ఆనంద్‌ (Dev Anand). ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మధుబాల 1969లో కేవలం 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు గతంలో పలువురు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు భన్సాలీ నిర్మాతగా ఈ ప్రాజెక్టు ముందుకు వస్తుందా లేదా అనేది ఎదురుచూడాల్సిందే.

Read Also :

Trisha | త‌మిళ‌నాడు సీఎం అవుతా – వైర‌ల్ అవుతోన్న త్రిష ఓల్డ్ కామెంట్స్‌

OTT Streaming | ఓటీటీలోకి విశ్వ‌క్ సేన్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచి అంటే?

Advertisement
Advertisement