త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

kollywood | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఖుష్బూ కూతురు – డెబ్యూ మూవీలో ధ‌నుష్ మేన‌ల్లుడితో రొమాన్స్

కోలీవుడ్‌లోకి మ‌రో వార‌సురాలు ఎంట్రీ ఇస్తోంది. సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్ హీరోయిన్‌గా మార‌బోతుంది. ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌వీష్ హీరోగా న‌టిస్తోన్న ఓ పీరియాడిక‌ల్ స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్ మూవీలో అవింతక సుంద‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On May 28, 2026, 3.19 pm IST

kollywood | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఖుష్బూ కూతురు – డెబ్యూ మూవీలో ధ‌నుష్ మేన‌ల్లుడితో రొమాన్స్
Advertisement

kollywood | కీర్తి సురేష్‌, శృతి హాస‌న్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌...వార‌స‌త్వంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ద‌క్షిణాదిలో టాప్ హీరోయిన్లుగా మారారు. వీరే కాకుండా మ‌రికొంద‌రు క‌థానాయిక‌లు కూడా గ‌ట్టి బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమ‌స్ అయ్యారు. తాజాగా వీరి బాట‌లోనే మ‌రో వార‌సురాలు అడుగులు వేయ‌బోతుంది. హీరోయిన్‌గా మార‌బోతుంది. ఆ స్టార్ కిడ్ మ‌రెవ‌రో కాదు సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్‌.

పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌వీష్ హీరోగా త‌మిళంలో స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ రూపొందుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు పా రంజిత్ శిష్యుడు దాము ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఇందులో ప‌విష్‌కు జోడీగా ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. ఈ పీరియాడిక‌ల్ మూవీతోనే అవంతిక కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

రెట్రో లుక్‌...

ఇటీవ‌లే ప‌విష్‌, అవంతిక‌ల‌పై ఈ సినిమాకు సంబంధించి ఓ లుక్ టెస్ట్‌ను కూడా నిర్వ‌హించార‌ట‌. సాధార‌ణంగా డెబ్యూ మూవీ కోసం హీరోయిన్లు గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను ఎంచుకుంటుంటారు. కానీ అవంతిక మాత్రం ట్రెడిష‌న‌ల్ రోల్‌లో కోలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతుంద‌ట‌. రెట్రో లుక్‌లో చాలా డిఫ‌రెంట్‌గా ఆమె క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నీక్ మూవీతో ప‌వీష్ హీరోగా మారారు. అత‌డు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న మూడో మూవీ ఇది.

టాప్ హీరోయిన్‌గా...

1990 ద‌శ‌కంలో త‌మిళం, తెలుగు భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది వెంక‌టేష్‌, నాగార్జున వంటి అగ్ర హీరోల‌తో సినిమాలు చేసింది. క‌లియుగ పాండ‌వులు, కెప్టెన్ నాగార్జున‌, త్రిమూర్తులు, భార‌తంలో అర్జునుడుతో పాటు ప‌లు తెలుగు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి.

 

Advertisement
Advertisement