త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Story 2 | మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే సినిమా – కేర‌ళ స్టోరీ 2పై సీఏం ట్వీట్‌

కేర‌ళ స్టోరీ 2 సినిమాను బ‌హిష్క‌రించాలంటూ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డానికే క‌ల్పిత క‌థ‌ల‌తో ఈ సినిమా చేశార‌ని అన్నారు. కేరళను ఉగ్రవాదుల కేంద్రంగా చిత్రీకరించారంటూ సీఏం ఫైర్ అయ్యారు.

N

Entertainment | Published On Feb 19, 2026, 5.34 pm IST

Kerala Story 2 | మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే సినిమా – కేర‌ళ స్టోరీ 2పై సీఏం ట్వీట్‌
Advertisement

Kerala Story 2 |  కేర‌ళ స్టోరీ 2 మూవీ కేర‌ళ‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తోంది. ఈ సినిమాను బ‌హిష్క‌రించాలంటూ స్వ‌యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సోష‌ల్ మీడియా ద్వారా పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. కేర‌ళ స్టోరీకి సీక్వెల్‌గా కేర‌ళ స్టోరీ 2 మూవీ తెర‌కెక్కుతోంది. కేర‌ళ స్టోరీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విపుల్ అమృత్ లాల్ షా ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. ఇటీవ‌ల రిలీజైన కేర‌ళ స్టోరీ 2 ట్రైల‌ర్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. ఈ సినిమాను రిలీజ్ చేయ‌ద్దంటూ అధికార పార్టీ ఎల్‌డీఎఫ్‌తో పాటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోన్నాయి.

యూ /ఏ స‌ర్టిఫికెట్‌...

ప్ర‌భుత్వ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా కేర‌ళ స్టోరీ 2కు సెన్సార్ బోర్డు యూ/ ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. కేర‌ళ‌లోని కొంద‌రు మ‌హిళ‌ల క‌న్నీటి గాథ‌ల‌ను వెలుగులోకి తీసుకురావాల‌నే ఈ సినిమా చేసిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డిస్తోన్నారు. సెన్సార్ నుంచి యూ/ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చిందంటేనే మేము స‌గం విజ‌యం సాధించిన‌ట్లుగా భావిస్తోన్న‌ట్లు పేర్కొన్నారు.

సీఏం ట్వీట్‌...

కేర‌ళ స్టోరీ 2పై కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ చేసిన ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది. మ‌త సామ‌స‌ర్యానికి నిల‌య‌మైన‌ కేర‌ళ‌ను ఉగ్ర‌వాద కేంద్రంగా కేర‌ళ స్టోరీ 2లో చిత్రీక‌రించార‌ని, మ‌త‌త‌త్వ ఎజెండా ప్ర‌ధానంగా రూపొందిన‌ ఇలాంటి సినిమాల‌ను ప్ర‌జ‌లు బ‌హిష్క‌రించాల‌ని త‌న ట్వీట్‌లో విజ‌య‌న్ పేర్కొన్నారు.
మ‌త విద్వేషాలను రెచ్చ‌గొట్టేలా అబ‌ద్దాలు, క‌ల్పిత క‌థ‌ల‌తో చేసిన సినిమాల‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా సెన్సార్ నుంచి అనుమ‌తులు వ‌స్తున్నాయ‌ని,, విమ‌ర్శ‌నాత్మ‌క క‌థ‌ల‌తో చేసిన సినిమాల‌పై మాత్రం ఆంక్ష‌లు విధిస్తున్నార‌ని పిన‌ర‌యి విజ‌య‌న్ అన్నారు. కేరళ ప్రతిష్టను దిగజార్చేందుకు ప‌న్నిన కుట్ర‌గా కేర‌ళ స్టోరీ 2ను పిన‌ర‌యి విజ‌య‌న్ పేర్కొన్నారు.

యాంటీ కేర‌ళ ప్రొప‌గండా....

ఇటీవ‌ల‌ జ‌రిగిన ఓ వేడుక‌లో కూడా కేర‌ళ స్టోరీ 2పై పిన‌ర‌యి విజ‌య‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేర‌ళ స్టోరీ మొదటి భాగంలో చూపించినవన్నీ అవాస్త‌వాలేన‌ని, యాంటీ కేర‌ళ ప్రొప‌గండా ల‌క్ష్యంగా ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందించార‌ని, అక్ష‌రాస‌త్య‌, అభివృద్ధిలో ముందున్న కేర‌ళ‌ల‌ను ల‌వ్ జిహాద్‌ల‌తో మ‌త‌మార్పిడిల‌కు నిల‌యంగా మారింద‌ని త‌ప్పుగా చూపిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.
కేర‌ళ స్టోరీ 2లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వ‌ర్య ఓజా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కామాఖ్య నారాయ‌ణ్‌సింగ్ ఈ సినిమాను నిర్మించారు.

 

 

Advertisement
Advertisement