Keerthy Suresh | కీర్తి సురేష్ తగ్గేదేలే – రెండు రోజుల సాంగ్ కోసం అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?
మహానటి కీర్తి సురేష్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్యారడైజ్ మూవీలో నానితో కలిసి స్టెప్పులు వేయబోతుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ కేవలం రెండు రోజులు మాత్రమే డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ పాట కోసం కీర్తి సురేష్ స్వీకరించిన రెమ్యూనరేషన్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Entertainment | Published On Aug 1, 2026, 4.26 pm IST
Keerthy Suresh | స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించే ట్రెండ్ బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ఐటెంసాంగ్స్ ట్రెండ్‌ను సౌత్ హీరోయిన్లు ఫాలో అవుతోన్నారు. తమన్నా, కాజల్ అగర్వాల్‌తో పాటు చాలా మంది అగ్ర నాయికలు ప్రత్యేక గీతాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. వారి బాటలోనే మహానటి కీర్తి సురేష్ అడుగులు వేయబోతుంది. ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది.
నాని ప్యారడైజ్...
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ప్యారడైజ్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాటలో నానితో కలిసి కీర్తి సురేష్ స్టెప్పులు వేస్తోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. తెలంగాణ శైలిలో సాగే ఫోక్ సాంగ్ ఇదని సమాచారం. నాని, కీర్తి సురేష్‌లపై వచ్చే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.
రెండు రోజులు మాత్రమే...
ఈ స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ కేవలం రెండు రోజులు మాత్రమే డేట్స్ కేటాయించినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్స్ కారణంగా తొలుత ఈ పాటను రిజెక్ట్ చేయాలని అనుకుందంట. కానీ నానితో ఉన్న స్నేహం కారణంగా అంగీకరించినట్లు సమాచారం. రెండు రోజుల స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కోటిన్నర వరకు పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్‌గా ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. కానీ కేవలం ఓ సాంగ్ కోసమే అందులో సగం వరకు రెమ్యూనరేషన్‌ను స్వీకరించడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పూజా హెగ్డేను అనుకొని...
తొలుత ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను మేకర్స్ అప్రోచ్ అయ్యారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో చివరి నిమిషంలో బుట్టబొమ్మ ఈ పాటను రిజెక్ట్ చేసింది. ఆమె స్థానంలో కీర్తి సురేష్‌ను తీసుకున్నారు.
కయదు లోహర్...
ప్యారడైజ్ మూవీలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే వల్ల వాయిదాపడింది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ డేట్‌కు కూడా సినిమా రిలీజ్ కావడం అనుమానంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?






