TG Oilfed | ఆయిల్‌పామ్‌లో టీజీ ఆయిల్‌ఫెడ్ సరికొత్త రికార్డు
TG Oilfed | ఆయిల్‌పామ్ రంగంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆయిల్ ఇయర్‌లో రికార్డు స్థాయిలో 4.74 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే 44.60 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు రైతులకు గెలల కొనుగోలు కింద ఏకంగా రూ.1,100 కోట్లు చెల్లించింది.
- 44.60 శాతం పెరిగిన గెలల ప్రాసెసింగ్..
- రైతులకు రూ.1,100 కోట్ల చెల్లింపులు
- ప్రభుత్వ రంగంలో తొలి ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు శ్రీకారం
TG Oilfed | ఆయిల్‌పామ్ రంగంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆయిల్ ఇయర్‌లో రికార్డు స్థాయిలో 4.74 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే 44.60 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు రైతులకు గెలల కొనుగోలు కింద ఏకంగా రూ.1,100 కోట్లు చెల్లించింది. ప్రభుత్వ రంగంలోనే తొలి ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది. 2024-25లో 3.27 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసిన సంస్థ.. ఈ ఏడాది 4,73,997 మెట్రిక్ టన్నులకు పెంచింది. అంటే అదనంగా 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ చేపట్టింది. అప్పారావుపేట, నర్మెట్ట తోటల నుంచి వచ్చిన గెలలను ప్రాసెస్ చేస్తూ 19.62 శాతం ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) సాధించింది. నెలవారీ ప్రాసెసింగ్ 50,150 మెట్రిక్ టన్నులకు చేరగా.. రోజువారీ సామర్థ్యాన్ని 1,850 మెట్రిక్ టన్నులకు పెంచింది.
రైతులకు రూ.1,100 కోట్లు
రైతుల నుంచి కొనుగోలు చేసిన గెలలకు ఏడాది పొడవునా మెట్రిక్ టన్నుకు సగటున రూ.23,100 ధర చెల్లించింది. మొత్తం రూ.1,100 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. క్రాప్ హాలిడే లేకుండా నిరంతరాయంగా ప్రాసెసింగ్ కొనసాగించింది. గెలల అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసి రైతుల నిరీక్షణ సమయాన్ని తగ్గించింది. కొత్త సేకరణ కేంద్రాల ఏర్పాటుతో కొనుగోళ్లను మరింత సులభతరం చేసింది. నర్మెట్టలో నూతన ప్రాసెసింగ్ యూనిట్‌ను పూర్తి సామర్థ్యంతో నిర్వహిస్తోంది. ప్రస్తుతం అప్పారావుపేటలో 90, అశ్వారావుపేట, నర్మెట్టలో 30 టీపీహెచ్ సామర్థ్యంతో యూనిట్లు పనిచేస్తున్నాయి. అశ్వారావుపేట, బీచుపల్లి, మహబూబాబాద్‌లలో అదనపు యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కల్లూరుగూడెంలో 15 టీపీహెచ్ సామర్థ్యంతో నిర్మించిన యూనిట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిని భవిష్యత్తులో 60 టీపీహెచ్‌కు విస్తరించనున్నారు.
విజయ బ్రాండ్‌కు కొత్త ఊపు
విజయ బ్రాండ్ వంట నూనెల ఉత్పత్తి, ప్యాకింగ్, పంపిణీని విస్తరించేందుకు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన వంట నూనెలను పోటీ ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో తొలి ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో భాగంగా ఒక్క నెలలోనే 3.50 లక్షల మొక్కలను పంపిణీ చేసింది. జీవ ఎరువులను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. రైతులకు తక్కువ ధరలకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుపైనా దృష్టి సారించింది. ప్రాసెసింగ్ వ్యర్థాల నిర్వహణకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్లాంట్లు, గెలల సేకరణ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను పటిష్టం చేసింది. మొత్తంగా ప్రాసెసింగ్ సామర్థ్యం పెంపు, రైతులకు భారీ చెల్లింపులు, కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణ ఆయిల్‌పామ్ రంగంలో టీజీ ఆయిల్‌ఫెడ్ తనదైన ముద్ర వేస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!
- ●Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!
- ●Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!
- ●Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్
- ●November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే

Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!

Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు

TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!

Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!




