త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | కాంతారా వివాదం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌ణ్‌వీర్ సింగ్‌.. నాలుగువారాల్లో ఆల‌య సంద‌ర్శ‌న‌..!

Ranveer Singh | బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ క‌ర్నాటక హైకోర్టులో క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఈ కేసులో న‌టుడు దాఖ‌లు చేసిన స‌వ‌రించిన అఫిడ‌విట్‌ను కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. గ‌తేడాది జ‌రిగిన ఓ ఈవెంట్ ర‌ణ్‌వీర్ సింగ్ కాంతారా: చాప్ట‌ర్ 1లో రిష‌బ్ శెట్టిని అనుక‌రించాడు.

P

Entertainment | Published On Apr 25, 2026, 7.47 pm IST

Ranveer Singh | కాంతారా వివాదం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌ణ్‌వీర్ సింగ్‌.. నాలుగువారాల్లో ఆల‌య సంద‌ర్శ‌న‌..!
Advertisement

Ranveer Singh | బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ క‌ర్నాటక హైకోర్టులో క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఈ కేసులో న‌టుడు దాఖ‌లు చేసిన స‌వ‌రించిన అఫిడ‌విట్‌ను కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. గ‌తేడాది జ‌రిగిన ఓ ఈవెంట్ ర‌ణ్‌వీర్ సింగ్ కాంతారా: చాప్ట‌ర్ 1లో రిష‌బ్ శెట్టిని అనుక‌రించాడు. దైవాన్ని అవ‌మానించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న‌పై ఎఫ్ఆర్ఐ న‌మోదైంది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రణ్‌వీర్ తరఫు న్యాయవాది సజ్జన్ పూవయ్య కోర్టుకు సమాచారం అందించారు.

నిస్సందేహ క్షమాపణలు తెలిపేలా కొత్త అఫిడవిట్ దాఖలు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా, ఆయన ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తితో నమస్కరించనున్నట్లు కూడా తెలిపారు. ఈ కేసుపై స్పందించిన పిటిషనర్ తరఫు వాదనలో ఇది కేవలం చట్టపరమైన అంశం కాదని, మత విశ్వాసాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. దీనిపై కోర్టు కూడా ఇదే కారణంతో ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇవ్వలేదని వ్యాఖ్యానించింది.

విచారణలో కోర్టు, రణ్‌వీర్ సింగ్ నాలుగు వారాల్లో ఆలయాన్ని సందర్శిస్తారని ఆదేశాల్లో పేర్కొంటామని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఆయనపై కోర్టు తీవ్రంగా హెచ్చరించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఏ వ్యక్తీ ఒక సమాజం మత భావాలను దెబ్బతీయలేడని గతంలోనే కోర్టు స్పష్టం చేసిన విషయం ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. తాను మత విశ్వాసాలను గౌరవిస్తానని రణ్‌వీర్ సింగ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చివరికి కోర్టు ఆ అఫిడవిట్‌ను రికార్డులోకి తీసుకుని, విచార‌ణ‌ను ముగించనున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement