Kareena Kapoor | దీపావళి ఫొటోషూట్‌పై వివాదం – కరీనా కపూర్‌కు లీగల్ నోటీసులు
దీపావళి సందర్భంగా ఇటీవల చేసిన ఓ ఫొటోషూట్ కారణంగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ చిక్కుల్లో పడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. కరీనా కపూర్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Entertainment | Published On Nov 12, 2026, 6.40 pm IST
Kareena Kapoor | దీపావళి సందర్భంగా చేసిన ఓ ఫొటోషూట్ కారణంగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ చిక్కుల్లో పడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. దీపావళి వేళ రాయల్ లుక్‌లో కరీనా కపూర్ కనిపించింది. లేత గోధుమరంగు కఫ్తాన్, తలపాగా ధరించి రాజసం ఉట్టిపడేలా యువరాణిలా మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
200 ఏళ్ల నాటి లాకెట్...
మెడలో ముప్పై క్యారెట్ల ఖరీదైన వజ్రంతో కూడిన పచ్చ లాకెట్ ధరించింది. ఈ లాకెట్ రెండు వందల ఏళ్ల నాటిదని, భోపాల్ రాజవంశానికి చెందిన బేగం సాజిదా సుల్తాన్ నుంచి వారసత్వం సైఫ్ అలీఖాన్ కుటుంబానికి వచ్చినట్లు కరీనా కపూర్ స్టైలిస్ట్ రియా కపూర్ ప్రకటించింది.
అభ్యంతరం...
స్టైల్ కోసం ధరించిన ఈ లాకెట్ కరీనాకపూర్‌ను చిక్కుల్లో పడేసింది. ఈ లాకెట్‌పై ఖురాన్‌లోని కొన్ని వ్యాఖ్యలు పొందుపరిచారు. పవిత్రమైన ఖురాన్ ప్రవచనాలను ఫ్యాషన్ కోసం వాడటంపై మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అబ్బాస్ హఫీజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీనా కపూర్‌తో పాటు రియా కపూర్‌లకు లీగల్ నోటీసులు పంపించారు. ముస్లిమ్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడమే కాకుండా కరీనా, రియా కపూర్ క్షమాపణలు చెప్పాలని అబ్బాస్ హఫీజ్ డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లోపు క్షమాపణలు చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు.
సపోర్ట్...
మరోవైపు ఈ వివాదంపై హిందూ ఉత్సవ్ సమితీ కరీనా కపూర్‌కు అండగా నిలిచింది. పవిత్రమైన ప్రవచనాలు, వ్యాఖ్యలతో కూడిన లాకెట్లు ధరించడం సంప్రదాయంలో ఒక భాగమేనని, అందులో ఎలాంటి తప్పు లేదని హిందూ ఉత్సవ్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు.
డైరా...
కాగా ఈ వివాదంపై అటు కరీనా కరీనాకపూర్‌తో పాటు రియా కపూర్ మాత్రం రియాక్ట్ కాలేదు. ఇటీవలే డైరా మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది కరీనాకపూర్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మేఘన గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం
- ●Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణికి అరుదైన గౌరవం
- ●Jagga Reddy | రాష్ట్రమిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మనం రాయాలి
- ●Kishan Reddy | అది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్
- ●Skyroot Aerospace Brazil Deal | హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్' మరో అంతర్జాతీయ ముందడుగు.. బ్రెజిల్‌తో భారీ డీల్
- ●Unimech Aerospace | సరికొత్త రికార్డు సృష్టించిన డిఫెన్స్ స్టాక్.. ఆరు నెలల్లో 110 శాతం లాభం..

UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం

Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణికి అరుదైన గౌరవం

Jagga Reddy | రాష్ట్రమిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మనం రాయాలి

Kishan Reddy | అది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్






