Kishan Reddy | అది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్
Kishan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని రేవంత్ సర్కార్‌ను ఆయన నిలదీశారు.
ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు..?
రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని రేవంత్ సర్కార్‌ను ఆయన నిలదీశారు. ఢిల్లీలో గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అది భారత్ సమ్మిట్ కాదని.. దేశంపై విషం చిమ్మే శక్తుల కోసం ఏర్పాటు చేసిన సదస్సు అని మండిపడ్డారు. భారత అభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే కుట్ర అని ధ్వజమెత్తారు. మోదీపై తప్పుడు ఆరోపణలకు భారత్ సమ్మిట్ వేదిక ఏర్పాటు చేశారని, భారత వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ విజన్ ఏంటో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
దేశంలో పెట్టుబడులను అడ్డుకునేందుకే భారత్ సమ్మిట్ అని పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం, పేదరికం, కులమత రాజకీయాలు తగ్గాయన్నారు. దేశ అభివృద్ధిని రాహుల్ ఏనాడు అభినందించలేదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ మాట్లాడాలన్నారు. భారత్ సమ్మిట్‌లో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ అసమర్థత, విజన్ లేని రాహుల్ డైరెక్షన్, కాంగ్రెస్ తీరుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు.. అన్నివర్గాలను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తాజావార్తలు
- ●Jensen Huang Resigns Nvidia CEO | టెక్ ప్రపంచంలో పెను భూకంపం: 'చైనా స్పై' వివాదంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా
- ●Singer | పెళ్లిపీటలు ఎక్కబోతున్న పాపులర్ సింగర్స్
- ●22A lands | 22ఏ కు మోక్షమెలా?
- ●Bengaluru to Goa Vande Bharat Express | బెంగళూరు నుంచి గోవాకు సరికొత్త 'వందే భారత్'.. రూట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
- ●Ponguleti Srinivas Reddy | అప్పులున్నా, ఎన్ని తిప్పలున్నా ఇందిరమ్మ ఇళ్లు ఆగవ్.. ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ
- ●UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం

Jensen Huang Resigns Nvidia CEO | టెక్ ప్రపంచంలో పెను భూకంపం: 'చైనా స్పై' వివాదంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా

Singer | పెళ్లిపీటలు ఎక్కబోతున్న పాపులర్ సింగర్స్

22A lands | 22ఏ కు మోక్షమెలా?

Bengaluru to Goa Vande Bharat Express | బెంగళూరు నుంచి గోవాకు సరికొత్త 'వందే భారత్'.. రూట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!





