త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Unimech Aerospace | సరికొత్త రికార్డు సృష్టించిన డిఫెన్స్ స్టాక్.. ఆరు నెలల్లో 110 శాతం లాభం..

Unimech Aerospace | యునిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 5.52 శాతం పెరిగి రూ.2,025 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాల్లో నికర లాభం రెట్టింపు కాగా, ఆదాయం 98.4 శాతం పెరిగింది. అయితే షేరు విలువ అధికంగా ఉండడంతో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

S

Business | Published On Nov 12, 2026, 6.22 pm IST

Unimech Aerospace | సరికొత్త రికార్డు సృష్టించిన డిఫెన్స్ స్టాక్.. ఆరు నెలల్లో 110 శాతం లాభం..
Advertisement

Unimech Aerospace | యునిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 5.52 శాతం పెరిగి రూ.2,025 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాల్లో నికర లాభం రెట్టింపు కాగా, ఆదాయం 98.4 శాతం పెరిగింది. అయితే షేరు విలువ అధికంగా ఉండడంతో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

భారీగా పెరిగిన ఆదాయం..

డిఫెన్స్ రంగానికి చెందిన యునిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ షేర్లు భారీ డిమాండ్‌ను సొంతం చేసుకున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో భారీగా పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేశాయి. ఉదయం 9.41 గంటల సమయంలో ఈ షేరు 4.64 శాతం లాభంతో రూ.2,008 వద్ద ట్రేడయింది. అదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 0.4 శాతం లాభంతో 82,206 పాయింట్ల వద్ద కొనసాగింది. బీఎస్ఈలో సుమారు 22 వేల షేర్లు చేతులు మారగా, వాటి విలువ రూ.4.48 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా ఆకట్టుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ.31.8 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15.7 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 98.4 శాతం పెరిగి రూ.123 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.62 కోట్లుగా ఉంది. నిర్వహణ స్థాయిలో ఈబీఐటీడీఏ రూ.18.5 కోట్ల నుంచి రూ.49 కోట్లకు పెరిగింది. దీంతో ఈబీఐటీడీఏ మార్జిన్ 29.9 శాతం నుంచి 39.8 శాతానికి చేరింది. అంటే 990 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది.

6 నెల‌ల్లో 110 శాతం రాబ‌డి..

గత ఆరు నెలల్లో ఈ షేరు ఏకంగా 110.53 శాతం రాబడిని అందించింది. ఇదే సమయంలో సెన్సెక్స్ కేవలం 10.23 శాతం మాత్రమే పెరిగింది. మూడు నెలల్లో 42.13 శాతం, గత రెండు వారాల్లో 21.67 శాతం లాభపడింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 121.54 శాతం రాబడి అందించగా, ఇదే సమయంలో సెన్సెక్స్ 3.53 శాతం నష్టపోయింది. గతేడాది కాలంలో ఈ షేరు 100.93 శాతం పెరగ్గా, సెన్సెక్స్ 2.70 శాతం క్షీణించింది. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ ప్రకారం.. కంపెనీ క్యూ2 ఫలితాలు బలంగా ఉండడం, ఆదాయం 98 శాతం పెరగడం, నికర లాభం రెట్టింపు కావడం షేరు ధర పెరుగుదలకు ప్రధాన కారణాలు. కంపెనీ ఆర్డర్ బుక్ రూ.855 కోట్లుగా ఉంది. 2022-23 నుంచి 2025-26 మధ్య ఆదాయం సగటున ఏటా 60 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 95 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మొదటి ఆరు నెలల కంటే అధిక ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

అధిక పీఈతో జాగ్ర‌త్త‌..

అయితే కంపెనీ షేరు ప్రస్తుత ధరతో పోలిస్తే 117 రెట్ల పీఈ నిష్పత్తితో ట్రేడవుతుండడం ఆందోళన కలిగించే అంశమని రవి సింగ్ పేర్కొన్నారు. సాంకేతికంగా గత ఎనిమిది నెలల్లో దాదాపు 190 శాతం ర్యాలీ చేసిన ఈ షేరులో మధ్యకాలిక లక్ష్యం రూ.2,400గా ఉంటుంద‌ని, రూ.1,500 కీలక మద్దతు స్థాయిగా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే భారీగా పెరిగిన నేపథ్యంలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు ఎస్‌బీఐ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ షా మాట్లాడుతూ.. వారపు చార్టులో సెప్టెంబర్ చివరి నుంచి రూ.1,458 నుంచి రూ.1,901 మధ్య కదలాడిన షేరు తాజాగా ఆ పరిధిని అధిగమించిందని తెలిపారు. ట్రేడింగ్ పరిమాణం కూడా పెరగడం ఈ బ్రేక్‌అవుట్‌కు బలాన్నిస్తోందన్నారు. వారపు ఆర్ఎస్ఐ సూచీ 60 స్థాయి నుంచి వేగంగా పెరగడం బుల్లిష్ మొమెంటం బలపడుతున్నట్లు సూచిస్తోందని వివరించారు. రూ.1,900 నుంచి రూ.1,880 పరిధి తక్షణ మద్దతుగా ఉంటుందని, ఈ స్థాయికి పైన షేరు కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement