త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Divya Suresh | ప్ర‌ముఖ న‌టికి వేధింపులు.. న‌డిరోడ్డుపై అస‌భ్య‌క‌రంగా తాకుతూ

Divya Suresh | క‌న్న‌డ న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ దివ్య సురేష్‌ (Divya Suresh) వేధింపుల‌కు గుర‌య్యారు. ఆదివారం రాత్రి బెంగ‌ళూరు వీధుల్లో (Bengaluru Street) త‌న క‌జిన్‌తో క‌లిసి వెళ్తుండ‌గా ఓ అప‌రిచిత వ్య‌క్తి త‌మ‌ను వెంబ‌డిస్తూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని న‌టి తెలిపారు.

D

Movies | Published On Jun 30, 2026, 3.26 pm IST

Divya Suresh | ప్ర‌ముఖ న‌టికి వేధింపులు.. న‌డిరోడ్డుపై అస‌భ్య‌క‌రంగా తాకుతూ
Advertisement

Divya Suresh | క‌న్న‌డ న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ దివ్య సురేష్‌ (Divya Suresh)కు చేదు అనుభ‌వం ఎదురైంది. న‌డిరోడ్డుపై వేధింపుల‌కు గుర‌య్యారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు న‌టి సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆదివారం రాత్రి బెంగ‌ళూరు వీధుల్లో (Bengaluru Street) త‌న క‌జిన్‌తో క‌లిసి వెళ్తుండ‌గా ఓ అప‌రిచిత వ్య‌క్తి త‌మ‌ను వెంబ‌డిస్తూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని న‌టి తెలిపారు.

"ఆదివారం రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో నా క‌జిన్‌, నేను మా కారువైపు న‌డుచుకుంటూ వెళ్తున్నాం. ఆ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి మ‌మ్మ‌ల్ని వెంబ‌డించ‌డం ప్రారంభించాడు. అంతేకాదు, న‌డిరోడ్డుపై మ‌మ్మ‌ల్ని అస‌భ్య‌క‌రంగా తాకాడు. మేము అత‌న్ని అక్క‌డే ప్ర‌శ్నించాం. అయినా అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో ఎలాంటి మార్పూ లేదు. మేము కారు ఎక్కేంత వ‌ర‌కూ అత‌డు మా వెంటే వ‌చ్చి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు" అని న‌టి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టును బెంగ‌ళూరు న‌గ‌ర పోలీసుల‌కు ట్యాగ్ చేశారు. "మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ భ‌ద్ర‌త ఎక్క‌డ" అంటూ ప్ర‌శ్నించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోని కూడా న‌టి త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకోగా.. అది ఇప్పుడు అందుబాటులో లేదు.

కాగా, 33 ఏళ్ల దివ్య సురేష్ 2021లో బిగ్‌బాస్ క‌న్న‌డ సీజ‌న్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ షోకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక క‌న్న‌డ సీరియ‌ల్స్ నన్న హెండ్తి ఎంబీబీఎస్‌, జోడి హక్కి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో మోడల్‌గా పనిచేసిన దివ్య సురేష్.. 2017లో 'మిస్ ఇండియా సౌత్' టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. #9, హిల్టన్ క్రాస్, రౌడీ బేబీ, కెంపు హలది హసిరు, హిరణ్య వంటి చిత్రాల్లో న‌టించి గుర్తింపు పొందారు. ఇక గతేడాది బెంగ‌ళూరులో జ‌రిగిన ఒక హిట్ అండ్ ర‌న్ కేసులో దివ్య పేరు ప్ర‌ముఖంగా వినిపించింది.

Advertisement
Advertisement