త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI Prudential | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్త హైబ్రిడ్ ఫండ్.. జూలై 14 వరకు మాత్రమే ఎన్‌ఎఫ్‌వో అవకాశం..

ICICI Prudential | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యుచువల్ ఫండ్ తన కొత్త బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ ఫండ్ ను ప్రారంభించింది. ఇది ఓపెన్-ఎండెడ్ బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ స్కీమ్. ఈ ఫండ్‌లో ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో మాత్రమే పెట్టుబడులు ఉంటాయి. ఈ స్కీమ్‌లో ఆర్బిట్రాజ్ పెట్టుబడులకు అవకాశం ఉండదు.

S

Business | Published On Jun 30, 2026, 2.43 pm IST

ICICI Prudential | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్త హైబ్రిడ్ ఫండ్.. జూలై 14 వరకు మాత్రమే ఎన్‌ఎఫ్‌వో అవకాశం..
Advertisement

ICICI Prudential | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యుచువల్ ఫండ్ తన కొత్త బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ ఫండ్ ను ప్రారంభించింది. ఇది ఓపెన్-ఎండెడ్ బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ స్కీమ్. ఈ ఫండ్‌లో ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో మాత్రమే పెట్టుబడులు ఉంటాయి. ఈ స్కీమ్‌లో ఆర్బిట్రాజ్ పెట్టుబడులకు అవకాశం ఉండదు. ఈ ఫండ్‌కు సంబంధించిన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండగా, జూలై 14తో తేదీ ముగియనుంది. యూనిట్ల కేటాయింపు పూర్తైన తర్వాత ఐదు పని రోజులలోపు ఈ స్కీమ్‌ను నిరంతర కొనుగోలు, రీపర్చేజ్‌కు తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ద్వారా దీర్ఘకాలిక మూలధన వృద్ధితోపాటు ఆదాయాన్ని అందించడమే ల‌క్ష్యంగా ఈ ఫండ్ ను ఆఫ‌ర్ చేస్తున్నారు. ఈక్విటీ విభాగంలో వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లు, రంగాల్లో పెట్టుబడులు పెట్టనుండగా, డెట్ విభాగంలో డ్యూరేషన్, ఏఏఏ రేటెడ్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, క్రెడిట్ అవకాశాలను పరిశీలిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వాల్యుయేషన్లు, కంపెనీల ఆదాయాలు, బాండ్ యీల్డ్స్ ఆధారంగా ఈక్విటీ, డెట్ కేటాయింపును కాలానుగుణంగా సమీక్షిస్తారు.

ఈక్విటీ, డెట్‌ల‌తో స‌మ‌తుల్య విధానం..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సంకరన్ నరేన్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఫండ్‌ను రూపొందించామని తెలిపారు. ఈక్విటీ, డెట్‌కు ఒక్కోదానికి 40 నుంచి 60 శాతం మధ్య కేటాయింపు ఉండేలా పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమతుల్య విధానం ద్వారా స్థిరమైన ఆదాయంతోపాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో మొత్తం పోర్ట్‌ఫోలియోలో 40 నుంచి 60 శాతం వరకు ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత ఇన్‌స్ట్రుమెంట్లలో, మరో 40 నుంచి 60 శాతం వరకు డెట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడులు ఉంటాయి. ఒకే పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ రెండింటినీ కలపడం ద్వారా ఈక్విటీ మార్కెట్ పతనం సమయంలో నష్టాలను పూర్తిగా ఈక్విటీ ఆధారిత ఫండ్‌లతో పోలిస్తే కొంతవరకు నియంత్రించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను రూపొందించారు.

ఎంపిక చేసిన షేర్ల‌లో పెట్టుబ‌డులు..

ఈక్విటీ విభాగంలో టాప్-డౌన్, బాటమ్-అప్ విధానాల సమ్మేళనంతో ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెడతారు. ఇందులో దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పులు, రంగాల చక్రాలు వంటి మాక్రో అంశాలతోపాటు కంపెనీ లాభదాయకత, నగదు ప్రవాహం, పోటీ సామర్థ్యం, డిమాండ్ వంటి అంశాలను కూడా సమానంగా పరిగణనలోకి తీసుకుంటారు. డెట్ విభాగంలో వడ్డీ రేట్లపై అంచనాలు, క్రెడిట్ స్ప్రెడ్స్, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వివిధ రకాల సెక్యూరిటీలను ఎంపిక చేస్తారు. స్థిరమైన ఆదాయం అందించే అక్రూవల్ స్ట్రాటజీతోపాటు అవసరాన్ని బట్టి టాక్టికల్ డ్యూరేషన్ మేనేజ్‌మెంట్‌ను అనుసరిస్తారు. క్రెడిట్ ఎంపిక ప్రక్రియలో ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో నిర్మాణం, వడ్డీ రేట్లపై నిర్ణయాలు, డీల్ సోర్సింగ్, లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌ను పర్యవేక్షిస్తారు. క్రెడిట్ అనలిస్ట్ ఒప్పంద నిబంధనలు, రిస్క్ డైవర్సిఫికేషన్, క్రెడిట్ మూల్యాంకనంపై దృష్టి సారిస్తారు.

క‌నీసం రూ.500 పెట్టుబ‌డి..

ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి మొత్తం రూ.500. ఆ తర్వాత రూ.1 గుణాకారాల్లో అదనపు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ స్కీమ్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ పనితీరును క్రిసిల్ హైబ్రిడ్ 50+50 - మోడరేట్ ఇండెక్స్ తో పోల్చనున్నారు. ఈ స్కీమ్‌ను రోషన్ చుట్‌కే, మనీష్ బంతియా, అఖిల్ కక్కర్ నిర్వహించనున్నారు. దీర్ఘకాలిక మూలధన వృద్ధి, ఆదాయాన్ని కోరుకునే, ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అయితే ఫండ్ రిస్కోమీటర్ ప్రకారం ఇందులో పెట్టుబడి చేసిన అసలు మూలధనానికి అధిక రిస్క్ ఉంటుందని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement