త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr | మురుగ‌న్ త‌మిళ దేవుడు – పురాణాల‌ను వ‌క్రీక‌రించొద్దు – ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ మూవీపై త‌మిళ తంబీల ఫైర్‌

ఇడుపుకాయితం గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే తాజాగా మ‌రో తెలుగు సినిమా వివాదంలో చిక్కుకుంది. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమాపై త‌మిళ తంబీలు ఫైర్ అవుతోన్నారు. పురాణాల‌ను వ‌క్రీక‌రించి సినిమా తీస్తే రిలీజ్ చేయ‌నివ్వం అంటూ పోస్ట్‌లు, కామెంట్లు పెడుతున్నారు.

N

Entertainment | Published On Jun 30, 2026, 2.48 pm IST

Ntr  | మురుగ‌న్ త‌మిళ దేవుడు – పురాణాల‌ను వ‌క్రీక‌రించొద్దు – ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ మూవీపై త‌మిళ తంబీల ఫైర్‌
Advertisement

Ntr |  అనౌన్స్‌మెంట్‌తోనే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాతో మేక‌ర్స్ పురాణాల‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ త‌మిళ ప్ర‌జ‌లు ఫైర్ అవుతోన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మైథ‌లాజిక‌ల్ మూవీ రాబోతుంది. సోమ‌వారం ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. యుద్ధ దేవుడిగా పురాణాలు పేర్కొన్న కుమార‌స్వామి క‌థ‌తో ఈ సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ మూవీని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి రాధాకృష్ణ నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాను అనౌన్స్‌చేసిన మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శివుడి త్రిశూలం, డీఎన్ఏ ఆకారంతో పాటు టెంపుల్స్‌, యుద్ధ తాలూకు వినాశ‌నం క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ... కుమార‌స్వామి ఉత్త‌రాదిన జ‌న్మించి... ద‌క్షిణాదిన పూజ‌లు అందుకుంటున్నాడు. ఇది విశ్వానికి చెందాల్సిన క‌థ అంటూ పేర్కొన్నాడు.

తమిళ దేవుడు...

నాగ‌వంశీ ట్వీట్‌పై త‌మిళ తంబీలు ఫైర్ అవుతున్నారు. కుమార‌స్వామి ఉత్త‌రాదిన కాదు ద‌క్షిణాదిన జ‌న్మించాడ‌ని అంటున్నారు. మురుగ‌న్ త‌మిళ దేవుడు అని కామెంట్లు పెడుతున్నారు. పురాణాల‌ను వ‌క్రీక‌రించి సినిమా తీస్తే ఊరుకునేది లేద‌ని ట్వీట్స్‌, పోస్ట్‌లు పెడుతున్నారు. ఉత్త‌రాది దేవుడిగా కుమార‌స్వామిని చూపిస్తూ సినిమా తీస్తే రిలీజ్ చేయ‌నివ్వం అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.

త‌మిళ్ వ‌ర్సెస్ తెలుగు...

మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం త‌మిళ ప్ర‌జ‌ల వాద‌న‌ల‌ను ఖండిస్తున్నారు. దేవుడికి తెలుగు, త‌మిళం అనే భేదాలు ఉండ‌వ‌ని అంటున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో కుమార‌స్వామిని ఆరాధిస్తార‌ని, మురుగ‌న్ త‌మిళ దేవుడు అన‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో త‌మిళం వ‌ర్సెస్ తెలుగు నెటిజ‌న్లు ఒక‌రిని టార్గెట్ చేస్తూ మ‌రొక‌రు పెడుతోన్న ట్వీట్లు, పోస్ట్‌లు వైర‌ల్ అవుతోన్నాయి.ఇటీవ‌లే ఇడుపుకాయితం గొడ‌వ టాలీవుడ్ లో రచ్చగా మారింది.  ఈ వివాదం  స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే  జూనియర్ ఎన్టీఆర్ మూవీ చిక్కుల్లో పడటం ఆసక్తికరంగా మారింది.

అర‌వింద స‌మేత త‌ర్వాత‌....

అర‌వింద స‌మేత వీర రాఘవ త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్ర‌మ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో డ్రాగ‌న్ సినిమా చేస్తోన్నాడు ఎన్టీఆర్‌. మ‌రోవైపు వెంక‌టేష్‌తో చేస్తోన్న ఆద‌ర్శ కుటుంబం మూవీతో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement