త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – తెలుగులో రిలీజ్‌

మ‌మ్ముట్టి మ‌ల‌యాళం మూవీ క‌లంకావ‌ల్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. సోనీలివ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జ‌న‌వ‌రిలో ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Dec 29, 2025, 6.10 pm IST

Malayalam OTT | మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – తెలుగులో రిలీజ్‌

కలంకావల్

Advertisement

Malayalam OTT | మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం (Malayalam Movie) మూవీ క‌లంకావ‌ల్ డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా ఆడియెన్స్‌ను మెప్పించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టితో పాటు జైల‌ర్ ఫేమ్ వినాయ‌గ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జితిన్ కే జోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజై క‌లం కావ‌ల్ నిర్మాత‌కు రెండింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టింది. కేవ‌లం 25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 85 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకుంది. ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన నాలుగో మ‌ల‌యాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

సోనీ లివ్ ఓటీటీ...

ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. కాలం కావ‌ల్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఓ పోస్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల‌చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 9 నుంచి సోనీలివ్‌లో క‌లం కావ‌ల్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

విల‌న్‌గా ...

క‌లంకావ‌ల్ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో మ‌మ్ముట్టి (Mammootty)క‌నిపించారు. విల‌నిజాన్ని పండించిన తీరుతో పాటు ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌మ్ముట్టి, వినాయ‌క‌న్ పాత్ర‌ల‌తో పాటు ట్విస్ట్‌లు, స్టోరీ, స్క్రీన్‌ప్లే బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. లెంగ్తీ ర‌న్‌టైమ్ తో పాటు నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం మైన‌స్‌గా మారిన‌ట్లు విమ‌ర్శలు కూడా వినిపించాయి.

సీరియ‌ల్ కిల్ల‌ర్‌...

త‌మిళ‌నాడు కేర‌ళ స‌రిహ‌ద్దుల్లోని గ్రామాల్లో చాలా మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌వుతుంటారు. వారిని ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ దారుణంగా హ‌త‌మార్చుతుంటాడు. ఈ సీరియ‌ల్ కిల్ల‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్ బాధ్య‌త‌ల‌ను జ‌య‌కృష్ణ‌న్ అనే స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌కు అప్ప‌గిస్తారు అధికారులు. అత‌డి ఇన్వేస్టిగేష‌న్‌లో కిల్ల‌ర్ గురించి ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి? ఈ హ‌త్య‌ల‌కు స్టాన్లీ అనే వ్య‌క్తికి ఎలాంటి సంబంధం ఉంద‌నే అంశాల‌తో ద‌ర్శ‌ఖుడు జితిన్ క‌లంకావ‌ల్ సినిమాను రూపొందించారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని మ‌మ్ముట్టి స్వ‌యంగా నిర్మించారు.
మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో భ్ర‌మ‌యుగం, పురుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించారు.

ALSO READ Telugu Web Series | తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది – స్ట్రీమింగ్ డేట్ క‌న్ఫామ్‌
Advertisement

తాజావార్తలు

Advertisement