Naresh Pavitra Lokesh | ఓటీటీలో కొత్త సెలిబ్రిటీ టాక్ షో – గెస్ట్‌లుగా నరేష్, పవిత్రా లోకేష్
మరో సరికొత్త టాక్ షో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెకండ్ సన్‌రైజర్స్ పేరుతో లాంఛ్ అయిన ఈ షోకు సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ టాక్ షోకు నరేష్, పవిత్రా లోకేష్ గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు.
Entertainment | Published On Apr 26, 2026, 12.07 pm IST
Naresh Pavitra Lokesh | ప్రస్తుతం టాక్ షోల ట్రెండ్ నడుస్తోంది. ఈ టాక్ షోల కోసం టాప్ హీరోహీరోయిన్లు హోస్ట్‌లుగా అవతారం ఎత్తుతోన్నారు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ పెద్ద సక్సెస్ అయ్యింది. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయిన ఈ తెలుగు టాక్ షోకు పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్‌బాబుతో పాటు చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు. రానా దగ్గుబాటి, మంచు మనోజ్ తో పాటు మరికొంతమంది హీరోలు కూడా డిఫరెంట్ టాక్ షోలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు.
జియో హాట్ స్టార్‌లో...
తాజాగా మరో ఓటీటీ సెలిబ్రిటీ టాక్ షో లాంఛ్ అయ్యింది. సెకండ్ సన్‌రైజర్స్ పేరుతో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
ఒకప్పుడు స్టార్స్‌గా ఓ వెలుగు వెలిగి...ఆ తర్వాత సినిమాలకు చాలా కాలం పాటు దూరమై...మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కొందరు సెలిబ్రిటీలు ఈ షోకు గెస్ట్‌లుగా వచ్చారు. కెరీర్ స్ట్రగుల్స్, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల గురించి ఈ టాక్ షోలో వెల్లడించారు.
ఆరు ఎపిసోడ్స్...
ఈ టాక్ షో ఫస్ట్ సీజన్‌కు సంబంధించి ఆరు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వీటిలో మమతా మోహన్ దాస్, పూజా బేడీ, సుధా మీనన్, రమ్య సుబ్రమణియన్, జ్వాల గుత్తాతో పాటు నరేష్, పవిత్రా లోకేష్ గెస్ట్‌లుగా కనిపించారు. తమ బంధం గురించి నరేష్, పవిత్రా లోకేష్ ఈ షోలో ఓపెన్ అయ్యారు.
సుహాసిని మణిరత్నం హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోకు మరికొందరు టాలీవుడ్ సెలిబ్రిటీలు కూడా గెస్ట్‌లుగా హాజరుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Ashu Reddy | అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ ఇదే – రియల్ కాదు…రీల్ లైఫ్‌లో…
మే 9, 2026

Dhurandhar 2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ధురంధర్ 2.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఏప్రిల్ 10, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



