Kajal Aggarwal | ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తుంది. విశాఖ పేరుతో తెరకెక్కుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Dec 10, 2025, 1.46 pm IST
కాజల్ అగర్వాల్
Kajal Aggarwal |ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). చిరంజీవి, బాలకృష్ణ నుంచి ఎన్టీఆర్, మహేష్‌బాబు వరకు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో అదరగొట్టింది ఈ అందాల చందమామ.
గత కొన్నాళ్లుగా కాజల్ జోరు తగ్గింది. 2023లో వచ్చిన బాలకృష్ణ భగవంత్ కేసరి తర్వాత ఈ అమ్మడికి సరైన హిట్టు లేదు. సల్మాన్ ఖాన్ సికందర్‌తో బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ నిరాశే ఎదురైంది. కమల్‌హాసన్ ఇండియన్ 2తో పాటు మంచు విష్ణు కన్నప్పలో నటించింది. కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు.
దాంతో హీరోయిన్‌గానే సినిమాలు చేయాలనే రూల్‌ను పక్కనపెట్టేసింది కాజల్. స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేయడానికి రెడీ అవుతోంది. మరోవైపు ఓటీటీలపై కూడా ఫోకస్ పెట్టింది.
తాజాగా కాజల్ అగర్వాల్ తెలుగులో ఫస్ట్ టైమ్ ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నది. వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. విశాఖ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్ జియో హాట్ స్టార్‌లో(Jio HotStar) స్ట్రీమింగ్ కాబోతుంది. మంగళవారం చెన్నైలో జరిగిన సౌత్ అన్ బౌండ్ వేడుకలో విశాఖ సిరీస్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.
విశాఖ వెబ్‌సిరీస్‌కు స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. రైటర్ బీవీఎస్ రవి కథను అందిస్తున్నారు.
విశాఖ సిరీస్‌లో తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు చెబుతున్నారు. తన పిల్లల ప్రాణాలను కాపాడటం కోసం ఓ మహిళ ఎలాంటి పోరాటం చేసిందనే పాయింట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా విశాఖ వెబ్ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. విశాఖ షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోందట. వచ్చే ఏడాది జియో హాట్ స్టార్ ద్వారా కాజల్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెబుతున్నారు. హిందీలో విజయవంతమైన ఆర్య వెబ్ సిరీస్ ఆధారంగా విశాఖ రూపొందుతోన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణ సినిమాలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. రణబీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో యశ్‌కు జోడీగా మండోదరి పాత్రలో కనిపించబోతున్నది కాజల్
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



