Crime Thriller OTT | దృశ్యం డైరెక్టర్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – రెండు ఓటీటీలలో రిలీజ్ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో
దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వళత్తు వశతే కల్లన్ ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మనోరమా మ్యాక్స్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీలో జోజూ జార్జ్, బిజు మీనన్ హీరోలుగా నటించారు.
Entertainment | Published On Mar 28, 2026, 5.45 pm IST
Crime Thriller OTT | దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వళత్తు వశతే కల్లన్ ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
జీతూ జోసెఫ్ డైరెక్టర్...
వళత్తు వశతే కల్లన్ సినిమాలో జోజు జార్జ్, బిజుమీనన్ హీరోలుగా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. దృశ్యం తరహాలో మరో కల్ట్ క్లాసిక్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. జీతూ జోసెఫ్ స్టోరీ, స్క్రీన్‌ప్లేలలో మెరుపులు లేకపోవడంతో వళత్తు వశతే కల్లన్ దారుణంగా నిరాశపరిచింది. . ప్రెడిక్టబుల్ ట్విస్ట్‌లతో జీతూ జోసెఫ్ బోర్ కొట్టించాడంటూ విమర్శలు గుప్పించారు. జోజు జార్జ్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వినిపించాయి.
తండ్రీకొడుకుల కథ...
ఆంటోనీ జేవియర్ సీఐగా పనిచేస్తుంటాడు. అవినీతిపరుడిగా పేరుతెచ్చుకున్న ఆంటోనీ అతడి కొడుకు ఫిలిప్ అసహ్యించుకుంటాడు. సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న రాజీవ్ అనే వ్యక్తిపై ఓ యువతి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అనూహ్యంగా ఆ యువతితో పాటు ఆమె స్నేహితురాలు ఐరీన్ కూడా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసులో ఆంటోనీనే అనుమానితుడిగా మారతాడు. అదే టైమ్‌లో ఫిలిప్‌ను సామ్యూల్ జోసెఫ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. సామ్యూల్ జోసెఫ్ ఎవరు? అతడికి ఆంటోనీ చేసిన ద్రోహం ఏమిటి? ఐరీన్ హత్యకు ఫిలిప్‌కు ఎలాంటి సంబంధం ఉంది? కొడుకు విషయంలో ఆంటోనీ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడన్నదే వళత్తు వశతే కల్లన్ కథ.
ప్రస్తుతం జీతూ జోసెఫ్ దృశ్యం 3 సినిమాను తెరకెక్కిస్తోన్నారు. మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మే 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దృశ్యం ఫ్రాంచైజ్‌లో రానున్న మూడో మూవీ ఇది.
సంబంధిత వార్తలు

Drishyam 3 Twitter Review | దృశ్యం 3 ట్విట్టర్ రివ్యూ – మోహన్ లాల్ మూవీకి ఊహించని టాక్ – ఏదో అనుకుంటే?
మే 21, 2026

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

Krithi Shetty | ఓటీటీలోకి కృతి శెట్టి రొమాంటిక్ కామెడీ మూవీ – ఐదు భాషల్లో రిలీజ్
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



