త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Faria Abdullah | కొరియోగ్రాఫ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డ జాతిర‌త్నాలు హీరోయిన్

జాతిర‌త్నాలు హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా తన ల‌వ్‌స్టోరీని బ‌య‌ట‌పెట్టింది. టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఆ కొరియోగ్రాఫ‌ర్ పేరు మాత్రం చెప్ప‌లేదు ఫ‌రియా అబ్దుల్లా.

N

Entertainment | Published On Jan 22, 2026, 12.39 pm IST

Faria Abdullah | కొరియోగ్రాఫ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డ జాతిర‌త్నాలు హీరోయిన్
Advertisement

Faria Abdullah | టాలీవుడ్‌ హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఓ కొరియోగ్రాఫ‌ర్‌ను ల‌వ్ చేస్తున్న‌ట్లు స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన ఫ‌రియా అబ్దుల్లా జాతిర‌త్నాలు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసింది. న‌వీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిట్టి అనే అమాయ‌క‌పు యువ‌తిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది.

ర‌వితేజ రావ‌ణాసుర‌

జాతిర‌త్నాలు బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఫ‌రియా అబ్దుల్లాకు తెలుగులో చాలానే ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ర‌వితేజ రావ‌ణాసుర‌, ఆ ఒక్క‌టి అడ‌క్కుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. కానీ ఫ‌రియాకు హిట్టు మాత్రం ద‌క్క‌లేదు. త్వ‌ర‌లోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ప్రేమ‌లో ప‌డ్డా...

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను ప్రేమ‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది ఫ‌రియా అబ్దుల్లా. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తినే ల‌వ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. కానీ అత‌డి పేరు మాత్రం రివీల్ చేయ‌లేదు.

కొరియోగ్రాఫ‌ర్‌...

తాను ఇష్ట‌ప‌డుతున్న వ్య‌క్తి కొరియోగ్ర‌ఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పింది. "హీరోయిన్‌గా మారిన త‌ర్వాతే అత‌డితో నాకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌డు నా జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాతే నా వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర జీవితాన్ని స‌రిగ్గా బ్యాలెన్స్ చేసుకోగ‌లుతుగున్నాను. నా డ్యాన్స్‌లో మార్పు వ‌చ్చింది. ఇద్ద‌రం క‌లిసి ప‌నిచేస్తున్నాం. మా మ‌ధ్య ప్రేమ‌కు అతీత‌మైన‌ స్పెష‌ల్ రిలేష‌న్ ఉంది. ఇండ‌స్ట్రీ తీరుతెన్నుల‌పై అత‌డికి మంచి అవ‌గాహ‌న ఉంది. ఇద్ద‌రం స‌ల‌హాలు ఇచ్చిపుచ్చుకుంటాం" అని తెలిపింది. అంతే కాకుండా తాను ప్రేమిస్తున్న కొరియోగ్రాఫ‌ర్‌ ముస్లిం కాద‌ని హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తి అని ఫ‌రియా అబ్దుల్లా అన్న‌ది. జాతిర‌త్నాలు హీరోయిన్ కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి. ఫ‌రియా అబ్దుల్లా ల‌వ‌ర్ ఎవ‌ర‌న్న‌ది తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌లు యంగ్ కొరియోగ్రాఫ‌ర్ల పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.
ప్ర‌స్తుతం త‌మిళంలో సిగ్మా సినిమా చేస్తోంది ఫ‌రియా అబ్దుల్లా. ఈ మూవీతోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement