త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devika Bhatt | టాలీవుడ్‌లోకి మ‌రో క‌న్న‌డ సోయ‌గం- కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో రొమాన్స్‌

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా మ‌రో క‌న్న‌డ బ్యూటీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. టాలీవుడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైరెక్ట‌ర్‌గా మారి ఓ మాస్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రానికి జోడీగా క‌న్న‌డ సోయ‌గం దేవికా భ‌ట్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Jun 12, 2026, 1.49 pm IST

Devika Bhatt | టాలీవుడ్‌లోకి మ‌రో క‌న్న‌డ సోయ‌గం- కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో రొమాన్స్‌
Advertisement

Devika Bhatt |  టాలీవుడ్‌లో క‌న్న‌డ బ్యూటీల‌దే హ‌వా కొన‌సాగుతోంది. ర‌ష్మిక మంద‌న్న‌, రుక్మిణి వ‌సంత్‌, పూజా హెగ్డేతో పాటు ప‌లువురు క‌న్న‌డ హీరోయిన్లు తెలుగులో టాప్ స్టార్స్‌గా కొన‌సాగుతోన్నారు. తాజాగా మ‌రో క‌న్న‌డ బ్యూటీ తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది.
కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్‌గా మారి ఓ మాస్ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామా మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాలో అత‌డే హీరోగా న‌టించ‌నున్నాడు. . కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైరెక్ష‌న్ డెబ్యూ మూవీ శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ దేవికా భ‌ట్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

బృందా విహారి....

ప్ర‌స్తుతం క‌న్న‌డంలో బృందా విహారి పేరుతో ఓ సినిమా చేస్తోంది దేవికా భ‌ట్‌. దండుపాళ్యం డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో గోల్డెన్ స్టార్ గ‌ణేష్ హీరోగా న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లో బృందా విహారి సినిమా ప్రేక్ష‌కుల ముందుక రాబోతుంది. డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే తెలుగులో దేవికా భ‌ట్ ఛాన్స్ ద‌క్కించుకుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమాలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ట్రెడిష‌న‌ల్ రోల్‌లో దేవికా భ‌ట్‌ క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్‌బీఏ పూర్తి చేసిన ఈ బ్యూటీ సినిమాల‌పై ఇష్టంతో కార్పొరేట్ జాబ్‌ను వ‌దులుకుంద‌ట‌.

మాస్ లుక్‌లో....

కాగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో లుంగీ క‌ట్టి మాస్ లుక్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌నిపిస్తోన్నారు. ఇచ్చ‌ట అన్ని ర‌కాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ వండ‌బ‌డును అని పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తోన్న 13వ సినిమా ఇది. శుక్ర‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

 

Advertisement
Advertisement