Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు
Chariot Festival | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఎనిమిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై స్వామివారు భక్తులకు అభయమిస్తూ దర్శనమిచ్చారు.
Devotional | Published On Oct 19, 2026, 4.29 pm IST
Chariot Festival | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఎనిమిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై స్వామివారు భక్తులకు అభయమిస్తూ దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల మధుర ధ్వనులు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య తిరుమల పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
మహిళల భాగస్వామ్యంతో వైభవం

స్వర్ణరథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమాడ వీధులకు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని భక్తిప్రపత్తులతో స్వర్ణరథాన్ని లాగారు. బంగారు తేరుపై కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. అడుగడుగునా గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారికి భక్తితో నీరాజనాలు పలికారు.
సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం

స్వర్ణరథంపై శ్రీనివాసుడిని దర్శించుకోవడం సకల శుభప్రదమని భక్తుల నమ్మకం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, భూదేవి కరుణతో ధాన్యసంపదలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి కృపతో సుఖసంతోషాలు, శుభాలు కలుగుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో స్వర్ణరథంపై స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, ఆనందాన్ని అందించింది. స్వర్ణరథోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Blending Petrol | పెట్రోల్ కోసం చెరకు ఇథనాల్ కొనుగోళ్లకు బ్రేక్.. కేంద్రం కీలక నిర్ణయం!
అక్టోబర్ 19, 2026

Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?
అక్టోబర్ 19, 2026

Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
- ●Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ
- ●Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!
- ●Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!

Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!



