Janhvi Kapoor | ప్రియుడితో జాన్వీకపూర్ ఎంగేజ్‌మెంట్ – సోషల్ మీడియాలో రూమర్లు
శ్రీదేవి తనయ జాన్వీకపూర్ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల గ్రీన్ కలర్ ఎమరాల్డ్ రింగ్ ధరించి జాన్వీకపూర్ కనిపించడంతో ఎంగేజ్‌మెంట్ రూమర్లు మొదలయ్యాయి.
Entertainment | Published On Jan 26, 2026, 3.26 pm IST
Janhvi Kapoor | శ్రీదేవి తనయ జాన్వీకపూర్ పెళ్లి వార్తలు మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో చాలా కాలంగా ప్రేమలో ఉంది జాన్వీకపూర్. తమ రిలేషన్ విషయంలో ఈ జంట ఎలాంటి దాపరికాలు పాటించడం లేదు. గత కొన్నేళ్లుగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. శిఖర్‌తో కలిసి పలుమార్లు తిరుమలను దర్శించుకుంది జాన్వీకపూర్. వీరిద్దరు పెళ్లిపీటలెక్కబోతున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎమరాల్డ్ రింగ్...
తాజాగా ఇటీవల ముంబాయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు గ్రీన్ కలర్‌తో కూడి ఎమరాల్డ్ రింగ్ ధరించి జాన్వీకపూర్ అటెండ్ అయ్యింది. ఈ వేడుకలో ఆమె చేతి వేలికి ఉన్నఈ ఉంగరం హైలైట్ అయ్యింది. ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా గుర్తుగా కొందరు అమ్మాయిలు ఇలాంటి ఎమరాల్డ్ రింగ్స్ ధరిస్తుంటారు. జాన్వీకపూర్ కూడా ఎంగేజ్‌మెంట్ కూడా శిఖర్ పహారియాతో సీక్రెట్‌గా జరిగి ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ కావచ్చునని చెబుతున్నారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలపై జాన్వీతో పాటు శిఖర్ మాత్రం రియాక్ట్ కాలేదు. గతంలో ఓ సారి స్పెషల్ రింగ్‌తో జాన్వీ కనిపించడంతో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి. చివరకు అమ్మ గుర్తుగా ఆ ఉంగరాన్ని ధరించినట్లు జాన్వీ క్లారిటీ ఇచ్చింది.
పెళ్లికి అంగీకారం...
కాగా శిఖర్, జాన్వీ పెళ్లికి ఇప్పటికే ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. లండన్‌లో చదువుకున్న శిఖర్ పహారియా తండ్రితో కలిసి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. వీరి కుటుంబానికి సోబో ఫిల్మ్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్‌తో యాక్టర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
పెద్దితో...
మరోవైపు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది జాన్వీకపూర్. ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో పెద్ది సినిమా చేస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో అచ్చియమ్మ అనే మాస్ రోల్‌లో కనిపించబోతుంది. ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్.
హిందీలో గత ఏడాది హోమ్ బౌండ్, పరమ్ సుందరితో పాటు సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాలు చేసింది. హోమ్‌బౌండ్ ఆస్కార్ ఎంట్రీలో నిలిచింది. కానీ తుది నామినేషన్లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పల్లెటూరు అమ్మాయిలంటే చిన్నచూపా? – పెద్దిలో జాన్వీ రోల్‌పై నెటిజన్ల ఫైర్
మే 19, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026

Chiranjeevi | ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారు – పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ – డైలాగ్ లీక్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



