త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన జ‌గ‌ప‌తిబాబు – పెద్ది నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

పెద్ది మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు మేక‌ర్స్‌. జ‌గ‌ప‌తిబాబు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గుర్తుప‌ట్ట‌లేని విధంగా కంప్లీట్ డిఫ‌రెంట్ లుక్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

N

Entertainment | Published On Dec 29, 2025, 3.38 pm IST

Peddi Movie | గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన జ‌గ‌ప‌తిబాబు – పెద్ది నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌
Advertisement

Peddi Movie |  రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)హీరోగా ఉప్పేన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఓ రేంజ్‌లో హైప్ నెల‌కొంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన చికిరి సాంగ్‌తో పెద్దిపై ఉన్న అంచ‌నాలు డ‌బుల్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కు మ‌రో మూడు నెల‌లు టైమ్ ఉండ‌గానే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ జోరు పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు పెద్ది నుంచి రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్‌, శివ‌రాజ్‌కుమార్‌తో పాటు దివ్యేందు శ‌ర్మ ఫ‌స్ట్‌లుక్‌ల‌ను రిలీజ్ చేశారు.
తాజాగా సోమ‌వారం పెద్ది నుంచి మేక‌ర్స్ మ‌రో స్పెష‌ల్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. జ‌గ‌ప‌తిబాబు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేశారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ల‌సూరి అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. గ‌త సినిమాల‌కు భిన్నంగా కంప్లీట్ డిఫ‌రెంట్ లుక్‌లో జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు. క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి చింపిరి జుట్టుతో వృద్ధుడి గెట‌ప్‌లో రా అండ్ ర‌స్టిక్‌గా డిజైన్ చేసిన జ‌గ‌ప‌తిబాబు లుక్ ఆస‌క్తిని పంచుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ‌గా స్టైలిష్ క్యారెక్ట‌ర్స్ చేసిన జ‌గ‌ప‌తిబాబు పెద్దిలో మాత్రం డీ గ్లామ‌ర్ రోల్‌లో గుర్తుప‌ట్ట‌లేని విధంగా క‌నిపించ‌నున్న‌ట్లు ఈ పోస్ట‌ర్‌తో హింట్ ఇచ్చేశారు. . జ‌గ‌ప‌తిబాబు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

రిలీజ్ డేట్‌ఫై క్లారిటీ ...

జ‌గ‌ప‌తిబాబు పోస్ట‌ర్ ద్వారా మ‌రోసారి రిలీజ్ డేట్‌ఫై క్లారిటీ ఇచ్చారు. మార్చి 27న పెద్ది మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వెల్ల‌డించారు.ప్ర‌స్తుతం పెద్ది షూటింగ్ ఢిల్లీలో జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్‌, బొమ‌న్ ఇరానీతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ బుచ్చిబాబు. జ‌న‌వ‌రి నెలాఖ‌రులోగా షూటింగ్ కంప్లీట్ కానున్న‌ట్లు స‌మాచారం.
పెద్ది మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన చికిరి పాట యూట్యూబ్‌లో 200 మిలియ‌న్ల వ‌ర‌కు వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. జ‌న‌వ‌రిలో సెకండ్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. పెద్ది మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో వెంక‌ట స‌తీష్ కిలారు దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ALSO READ Allu Sirish | పెళ్లి డేట్ చెప్పేసిన శిరీష్ – అల్లు ఫ్యామిలీలో ఈ తేదీకి ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే?
Advertisement

తాజావార్తలు

Advertisement