Chukka Ramaiah’s 100th Birthday Celebrations | శిఖర సమానుడు చుక్కా రామయ్య.. నూరేళ్ల పండుగ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
Chukka Ramaiah | “తెలంగాణలో శిఖర సమానుడు చుక్కా రామయ్య (Chukka Ramaiah) అని.. వారికి సాటి ఎవరూ లేరని జస్టిస్ సుదర్శనరెడ్డి (Justice Sudarshan Reddy) అన్నారు.
Chukka Ramaiah’s 100th Birthday Celebrations | త్రినేత్ర న్యూస్: “తెలంగాణలో శిఖర సమానుడు చుక్కా రామయ్య (Chukka Ramaiah) అని.. వారికి సాటి ఎవరూ లేరని జస్టిస్ సుదర్శనరెడ్డి (Justice Sudarshan Reddy) అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు చుక్కా రామయ్య ఓ ప్రతీక అన్నారు. రామయ్య నూరేళ్ల పండుగ ప్రత్యేక సంచికను ఆవిష్కరించడం తనకు దక్కిన అతిగొప్ప అవార్డన్నారు. తెలంగాణలో మేధావులు, దిగ్గజాలంతా ఇక్కడకు వచ్చి చుక్కా రామయ్య నూరేళ్ల పండుగలో పాల్గొనడం ఆయన గొప్పదనమన్నారు. రామయ్యకు ఈరోజుకు నూరేళ్లు వచ్చినా ఇంకా ఆయన అందర్నీ గుర్తు పడుతున్నారని కొనియాడారు. ఆయన ముఖంలో వర్చస్సు అలానే ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన స్వగృహంలో రామయ్య నూరేళ్ల పండుగ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈనాడు పత్రిక సంపాదకులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చుక్కా రామయ్య గొప్ప టీచర్ అన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప మాస్టారు రామయ్య అని చెప్పారు. ప్రపంచంలోని ఐటి రంగంలో తెలుగవాడు జెండా ఎగరేయడానికి చుక్కా రామయ్య పయనీర్ అని పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఈరోజు ఎందరో తెలుగువారున్నారంటే అందుకు చుక్కా రామయ్యే కారణమన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) మాట్లాడుతూ.. చుక్కా రామయ్య తనకు గురువు అని అన్నారు. లోకంలో ఎందరో ఉపాధ్యాయులున్నా చుక్కా రామయ్య వంటి ఉపాధ్యాయులు అరుదన్నారు. 1964లో రామయ్య ఫిజిక్స్ క్లాస్‌లో కూర్చొని తాను శ్రద్ధగా పాఠాలు విన్నానని.. ఒకసారి వారి పాఠం విన్నాక, తిరిగి చదవాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారి కాళ్ళకు మొక్కానని, అది వారి గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఐఐటీ శిక్షణలో చుక్కావారి శిక్షణ చూపుడువేలు లాంటిదన్నారు. బాసరలో ఐఐటీ స్థాపనకు చుక్కా రామయ్యే కారణమన్నారు. విద్యను ప్రజాస్వామీకరణ చేసిన మహానుభావుడు చుక్కా రామయ్య అన్నారు. రామయ్య స్ఫూర్తితో ముందుకు నడుస్తామన్నారు.
ఆచార్య హరగోపాల్ (Haragopal) మాట్లాడుతూ.. రామయ్య గురించి మాట్లాడటమంటే.. నూరేళ్ల తెలంగాణ.. చరిత్ర గురించి మాట్లాడాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడన్నారు. అధ్యాపకుడిగా ఆయన విద్యార్థులకు ఆదర్శంగా ఉండేవారన్నారు. చుక్కా రంగయ్య గణితోపాధ్యాయుడిగా ఉండి వివిధ రంగాల్లో తన బలమైన ముద్ర వేశారన్నారు. తన శ్రీమతి చుక్కా రామయ్య ఒకే పాఠశాలలో పని చేశారని.. ఆయన సిఫారసుతోనే ఆమెను పెళ్ళాడినట్లు గుర్తు చేశారు. అలా తన శ్రీమతి ఆయనకు కూతురైందని.. తాను అల్లుడయ్యానని అన్నారు.
కాగా అంతకుముందు వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు, ప్రముఖ పాత్రికేయులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, వారి శిష్యులు వందల సంఖ్యలో హాజరై పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజావార్తలు
- ●Kriti Sanon | ప్రియుడికి రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ - లవ్‌స్టోరీని కన్ఫామ్ చేసిన ప్రభాస్ హీరోయిన్
- ●META | గచ్చిబౌలి మెటా ఆఫీస్ ముట్టడి
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Kriti Sanon | ప్రియుడికి రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ - లవ్‌స్టోరీని కన్ఫామ్ చేసిన ప్రభాస్ హీరోయిన్

META | గచ్చిబౌలి మెటా ఆఫీస్ ముట్టడి

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ



