Web Series Review | ఇసకపట్నం రివ్యూ – ఐశ్వర్య రాజేష్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ ఇసకపట్నం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే
Entertainment | Published On Jul 2, 2026, 11.07 am IST
Web Series Review | ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఇసకపట్నం వెబ్‌సిరీస్ గురువారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగు వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
నాయుడు అధికారం...
ఇసకపట్నం పోర్టు ఏరియాలో నాయుడు (సముద్రఖని) చెప్పిందే వేదం. కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన నాయుడు అక్రమ వ్యాపారాలతో కోట్లు గడిస్తాడు. తండ్రి చేసే పనుల కూతురు భారతికి (ఐశ్వర్య రాజేష్) నచ్చవు. నాయుడి స్థానంపై కన్నేసిన పోతన (జ్వాలా కోటి) ప్రత్యర్థి ప్రతాప వర్మతో (రవివర్మ) చేతులు కలిపి కుట్రలు పన్నుతుంటాడు. నాయుడి దగ్గరే పనిచేసే శేఖర్ (రాజా చెంబోలు) కూడా ఇసకపట్నం సామ్యాజ్యానికి తానే అధిపతి కావాలని కలలుకంటుంటాడు. తండ్రి దగ్గర పనిచేసే సూరిని (సుధాకర్ కోమాకుల) భారతి ఇష్టపడుతుంది. నాయుడు మాత్రం స్వార్థం కోసం కూతురికి మరో పెళ్లి చేస్తాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భారతి ఏం చేసింది? భారతిని ప్రేమించిన సూరి ఎలా జైలుపాలయ్యాడు? ఇసకపట్నంలో జరిగిన బ్లాస్ట్ వెనుక ఎవరున్నారు? నాయుడు రాజకీయాల కారణంగా ఆటోడ్రైవర్ పెద్దన్న (నరేష్ అగస్త్య) ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడింది? నాయుడు తర్వాత ఇసకపట్నం లీడర్‌గా ఎవరయ్యారు? భారతి గురించి నాయుడికి ఎలాంటి నిజాలు తెలిశాయి? అన్నదే ఇసకపట్నం వెబ్‌సిరీస్ కథ.
లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో...
ఓ ప్రాంతాన్ని శాసించే విలన్....అతడిని ఎదురించే సామాన్యుడైన హీరో...ఈ పోరాటంలో ఎదురయ్యే ట్విస్ట్, టర్న్‌లతో తెలుగు తెరపై చాలానే సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఇసకపట్నం కూడా ఈ రొటీన్ ఫార్ములా కథతోనే రూపొందింది. లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో తెలిసిన కథనే మేకర్స్ కొత్తగా చెప్పారు. పొలిటికల్ కథల్లో విలన్ ఓ ప్లాన్ వేయడం....అతడిని తమ తెలివితేటలతో హీరో లేదంటే హీరోయిన్ దెబ్బ కొట్టడం కామన్‌గా కనిపిస్తుంది. రివేంజ్ ఫార్ములాను ఇసకపట్నంలో చాలా ఇంట్రెస్టింగ్ రాసుకున్నారు దర్శకుడు. నాయుడికి వ్యతిరేకంగా కుట్రలు చేసేది ఎవరన్నది చివరి వరకు రివీల్ కాకుండా గ్రిప్పింగ్‌గా నడిపించారు. ఒక్కో పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తూ సస్పెన్స్‌ను హోల్డ్ చేయడం బాగుంది.
కేవలం పొలిటికల్ అంశాలకే పరిమితం కాకుండా లవ్‌స్టోరీని చూపించారు. నాయకులు తమ స్వార్థం కోసం సామాన్యులతో ఎలా ఆటలు ఆడుకుంటారని, అవసరం తీరిన తర్వాత ఎలా పక్కనపెడుతుంటారన్నది ఆలోచనాత్మకంగా ఆవిష్కరించారు. ప్రతి క్యారెక్టర్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తాయి. పైకి నెగెటివ్‌గా కనిపించే పాత్రలు పాజిటివ్‌గా....విలన్ అనుకున్నవాళ్లు మంచివాళ్లుగా చూపించిన తీరు బాగుంది. ట్విస్ట్‌లు బాగా వర్కవుట్ అయ్యాయి.
ఎస్టాబ్లిష్ చేయడంలో...
సిరీస్ మొదలైన తీరు బాగుంది. కానీ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం దర్శకుడు తడబడిపోయారు. నాయుడు విలనిజం డైలాగ్స్‌కే పరిమితమైంది. నాయుడిని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులన్నీ సాదాసీదాగానే అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్‌గానే ఉంది. సునీల్, రాజా చెంబోలు, నరేష్ అగస్త్యలను పూర్తిస్థాయిలో వాడుకోలేదు.
గూస్‌బంప్స్...
ఐశ్వర్య రాజేష్ ఎంత మంచి నటి అన్నది మరోసారి ఈ సిరీస్ చాటిచెప్పింది. జాతర సీన్‌తో పాటు ఆశ్రమం హెడ్‌ను భయపెట్టే సన్నివేశాల్లో ఐశ్వర్య నటన గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. నాయుడిగా సముద్రఖనికి ఇలాంటి పాత్రలు అలవాటే. ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. సుధాకర్ కొమాకులకు మాస్ రోట్ సెట్టవ్వలేదు. ఆటోడ్రైవర్ క్యారెక్టర్‌లో ఎమోషనల్ యాక్టింగ్‌తో నరేష్ అగస్త్య మెప్పించాడు. సునీల్, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటితో పాటు మిగిలిన వారిన నటన నాచురల్‌గా సాగింది.
పొలిటికల్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు....
ఇసకపట్నం ప్రొడక్షన్ వాల్యూస్‌తో పాటు డైరెక్టర్ టేకింగ్, ఎడిటింగ్ బాగున్నాయి. పొలిటికల్ డైలాగ్స్‌లో కొన్ని బాగా పేలాయి. సిరీస్ అయినా ఇందులో మూడు పాటలు పెట్టారు. ఆ సాంగ్స్ పరవాలేదు.
పొలిటికల్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఆడియెన్స్‌ను ఇసకపట్నం మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.37వేలు పెరిగింది..
- ●WhatsApp | వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు భారీ సెక్యూరిటీ.. మోసాలకు చెక్ పెట్టేలా ఫీచర్లు..
- ●ACB Raids | డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఏకకాలంలో 20 చోట్ల దాడులు
- ●Stock Markets | చమురు ధరల ఊరటతో మార్కెట్లు జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
- ●Merger Talks | కాంగ్రెస్‌లో విలీనం కానున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. తుది దశకు చర్చలు!
- ●India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?

Gold And Silver Prices Today | బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.37వేలు పెరిగింది..

WhatsApp | వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు భారీ సెక్యూరిటీ.. మోసాలకు చెక్ పెట్టేలా ఫీచర్లు..

ACB Raids | డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఏకకాలంలో 20 చోట్ల దాడులు

Stock Markets | చమురు ధరల ఊరటతో మార్కెట్లు జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..






