WhatsApp | వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు భారీ సెక్యూరిటీ.. మోసాలకు చెక్ పెట్టేలా ఫీచర్లు..
WhatsApp | వాట్సాప్ ఈ ఏడాది చివర్లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అధికారిక ప్రారంభానికి ముందే తమకు నచ్చిన యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే అవకాశం పొందారు. అయితే ప్రస్తుతం ఈ యూజర్‌నేమ్‌లను పూర్తిస్థాయిలోఉపయోగించే అవకాశం అందుబాటులో లేదు.
Technology | Published On Jul 2, 2026, 10.52 am IST
WhatsApp | వాట్సాప్ ఈ ఏడాది చివర్లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అధికారిక ప్రారంభానికి ముందే తమకు నచ్చిన యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే అవకాశం పొందారు. అయితే ప్రస్తుతం ఈ యూజర్‌నేమ్‌లను పూర్తిస్థాయిలోఉపయోగించే అవకాశం అందుబాటులో లేదు. ఫీచర్ పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే మోసాలు, నకిలీ గుర్తింపులను అడ్డుకునేందుకు అవసరమైన భద్రతా వ్యవస్థలను వాట్సాప్ సిద్ధం చేస్తోంది. వాట్సాప్ ప్రతినిధులు తెలిపిన ప్రకారం, పబ్లిక్‌గా కనిపించే యూజర్‌నేమ్‌లతో వచ్చే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు కంపెనీ బహుళ స్థాయి రక్షణ వ్యవస్థను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై నకిలీ గుర్తింపుల ప్రమాదాల దృష్ట్యా పరిశీలన జరుపుతోందని, అవసరమైతే ఈ ఫీచర్‌ను నిలిపివేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రముఖుల పేర్లను దుర్వినియోగం చేయకుండా..
ప్రముఖ వ్యక్తుల పేర్లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు వాట్సాప్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, వెరిఫైడ్ మెటా ఖాతాలు, అలాగే ప్రసిద్ధ పేర్లను పోలి ఉండే యూజర్‌నేమ్‌లను కంపెనీ ప్రత్యేకంగా రిజర్వ్ చేసింది. ఈ యూజర్‌నేమ్‌లను కేవలం అసలైన యజమానులే పొందేలా భద్రపరుస్తోంది. దీంతో గుర్తింపు దొంగతనం లేదా నకిలీ ఖాతాల ద్వారా మోసాలకు అవకాశం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. అలాగే వాట్సాప్ ఖాతాను సృష్టించడానికి, ఉపయోగించడానికి ఫోన్ నంబర్ తప్పనిసరిగా కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. యూజర్‌నేమ్ అంటే ఫోన్ నంబర్‌కు ప్రత్యామ్నాయం కాకుండా అదనపు గుర్తింపుగా మాత్రమే పనిచేస్తుంది. యూజర్‌నేమ్ ఫీచర్‌తో స్పామ్ సందేశాలు, అనవసర సంప్రదింపులు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ పలు రక్షణ చర్యలను కూడా అమలు చేస్తోంది.
ఆటోమేటెడ్ వ్యవస్థలతో సెక్యూరిటీ..
ఒక యూజర్‌ను వెతకడానికి కచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాల్సిందే. సాధారణంగా పేరుతో లేదా విస్తృతంగా శోధించి ఎవరినైనా కనుగొనే అవకాశం ఉండదు. ఒక యూజర్ నిర్దిష్ట వ్యవధిలో ఎంతమంది కొత్త ఖాతాలను సంప్రదించవచ్చనే విషయంలో పరిమితులు విధిస్తారు. యూజర్‌నేమ్‌ను పదే పదే ఊహిస్తూ ప్రయత్నించే బ్రూట్-ఫోర్స్ దాడులను గుర్తించి వెంటనే అడ్డుకునే వ్యవస్థను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా మోసాలు, నకిలీ గుర్తింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి తొలగించేందుకు ఆల్గోరిథమ్ ఆధారిత ఆటోమేటెడ్ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తాయి. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, యూజర్‌నేమ్ ద్వారా తొలిసారి ఎవరైనా సందేశం పంపితే వినియోగదారులకు అదనపు సమాచారం కూడా చూపిస్తారు. సందేశం పంపిన వ్యక్తి కొత్తగా సృష్టించిన ఖాతానా, ఇప్పటికే కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తా, ఉమ్మడి గ్రూపులు ఉన్నాయా లేదా వేరే దేశం నుంచి సంప్రదిస్తున్నారా అనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమాచారంతో వినియోగదారులు వచ్చిన సందేశాన్ని అంగీకరించాలా, బ్లాక్ చేయాలా లేదా రిపోర్ట్ చేయాలా అనే విషయంలో మరింత కచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Maha Padayatra | రిజర్వాయర్లు నింపండి.. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్ర.. వీడియో
- ●Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..
- ●Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!
- ●Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?
- ●MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Maha Padayatra | రిజర్వాయర్లు నింపండి.. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్ర.. వీడియో

Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..

Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!

Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?






