Telugu Web Series | అప్పట్లో సూపర్ హిట్ సీరియల్ …ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా అరవై ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్
1990 దశకంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మర్మదేశం సీరియల్ వెబ్‌సిరీస్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరభద్రుని రహస్యం పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జూన్ 26 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Jun 22, 2026, 8.56 pm IST
Telugu Web Series | మర్మదేశం సీరియల్ 1990 దశకంలో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సాధించిన సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది. మర్మదేశం సీరియల్ ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరభద్రుని రహస్యం పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ జీ 5 ఓటీటీలో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మొత్తం అరవై ఎపిసోడ్స్‌తో వీరభద్రుని రహస్యం వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు జీ5 ఓటీటీ ప్రకటించింది.
అనౌన్స్‌మెంట్ వీడియో...
ఈ వెబ్‌సిరీస్ అనౌన్స్‌మెంట్ వీడియోను జీ5 ఓటీటీ సోమవారం రిలీజ్ చేసింది. నమ్మకం భయంగా మారినప్పుడు.. నిజం కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది.. అంటూ ‘వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో ఆసక్తిని పంచుతోంది. మైథలాజికల్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఈ సిరీస్ రూపొందుతోన్నట్లు చూపించారు.
వీరభద్రస్వామి....
వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామి అండలో జీవిస్తుంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు.. అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాడని అండరూ గాఢంగా నమ్ముతుంటారు. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా..ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది. గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు కనిపిస్తుంటాయి. ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావిస్తుంటారు. అయితే వాటి వెనుక నిజం ఏమిటో అని మాత్రం ప్రశ్నించడానికి ఎప్పుడూ ధైర్యం చేయరు. తరతరాలు వారందరూ పాటిస్తున్న సాంప్రదాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొనసాగేలా చేస్తుంది. దీంతో వారు బలవంతంగా, దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు.
దైవశిక్ష...
మూఢనమ్మకాలతో నిండిన ఆ గ్రామంలోకి వెన్నెల ( అన్నీ ) అడుగుపెడుతుంది. ఆమె వచ్చిన సమయంలో గ్రామంలో హత్యకు గురవుతాడు. అక్కడి ప్రజలు దానిని దైవ శిక్షగా చెబుతారు. కానీ వెన్నెల మాత్రం వారి మూఢనమ్మకాలను కొట్టిపడేస్తుంది. వెన్నెల అన్వేషణలో గ్రామంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. భక్తి పేరుతో చేస్తోన్న దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, తరతరాల భయాల వెనుక దాచిన చీకటి గతాన్ని వెన్నెల ఎలా బయటపెట్టిందనే అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
ఆరవై ఎపిసోడ్...
వీరభద్రుని రహస్యం సిరీస్‌కు భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందంగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, అభినవ్‌గా ఎస్‌ఐ రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష కనిపించబోతున్నారు. మొత్తం 60 ఎపిసోడ్‌లతో ‘వీరభద్రుని రహస్యం’ సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ – డిజాస్టర్ టాక్‌తో నలభై ఐదు కోట్ల కలెక్షన్స్
జూన్ 22, 2026

Peddi OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి పెద్ది – రామ్‌చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
జూన్ 22, 2026

Prabhas | బాహుబలి మూవీపై వెబ్‌సిరీస్ – ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పబోతున్న ప్రభాస్, అనుష్క
జూన్ 21, 2026
తాజావార్తలు
- ●Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క
- ●Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
- ●Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'
- ●Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి - నాలుగు భాషల్లో బిజీ
- ●RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?
- ●TG Rains | ఐదురోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క

Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్

Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'

Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి - నాలుగు భాషల్లో బిజీ




