త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raviteja Irumudi | అయ్య‌ప్ప మాల‌లో ర‌వితేజ – ఇరుముడి ఎత్తుకొని…

ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌డు హీరోగా న‌టిస్తున్న 77వ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో ర‌వితేజ అయ్య‌ప్ప‌మాల‌లో క‌నిపిస్తున్నారు.

N

Entertainment | Published On Jan 26, 2026, 11.03 am IST

Raviteja Irumudi | అయ్య‌ప్ప మాల‌లో ర‌వితేజ – ఇరుముడి ఎత్తుకొని…
Advertisement

Raviteja Irumudi  వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో క‌థ‌ల ఎంపిక‌లో త‌న పంథా మార్చేశారు ర‌వితేజ‌. మాస్ క‌థ‌ల‌కు కొన్నాళ్లు గ్యాప్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. సంక్రాంతికి రిలీజైన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీతో మాస్ మ‌హారాజా అనే ట్యాగ్‌ను ప‌క్క‌న‌పెట్టారు. ర‌వితేజ సినిమా అంటేనే ఆయ‌న మార్కు మాస్ డైలాగ్స్‌, హీరోయిజం, యాక్ష‌న్ అంశాలు ఉంటాయి. అవేవి లేకుండా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీని చేసి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు.

బ‌ర్త్‌డే ట్రీట్‌...

తాజాగా త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం అభిమానుల‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు ర‌వితేజ‌. భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి త‌ర్వాత నిన్నుకోరి, మ‌జిలీ సినిమాల ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు ర‌వితేజ‌. ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు.

ఇరుముడి...

ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉంది. ఇందులో అయ్య‌ప్ప మాల‌లో ర‌వితేజ క‌నిపిస్తున్నారు. త‌ల‌పై ఉన్న ఇరుముడిని ఓ చేతిలో ప‌ట్టుకొని మ‌రో చేతిలో చిన్నారిని ఎత్తుకొని ర‌వితేజ పోస్ట‌ర్‌లో క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. అత‌డి చుట్టూ అయ్య‌ప్ప స్వాములు న్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి మైథాల‌జీ ఎలిమెంట్‌ను మేళ‌వించి ఇరుముడి సినిమా రూపొంద‌నున్న‌ట్లు ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇరుముడి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌

ర‌వితేజ గ‌త సినిమాల‌కు భిన్నంగా రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో ఈ సినిమా సాగుతుంద‌ట‌. ఇందులో ర‌వితేజ ఆటోడ్రైవ‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇరుముడిలో ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెమ్యూన‌రేష‌న్ లేకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో ర‌వితేజ ఇరుముడి సినిమాను చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న 77వ సినిమా ఇది.

Advertisement

తాజావార్తలు

Advertisement