త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | అల్లు అర్జున్ ‘రాకా’ ఆలస్యం … దీపికా పడుకోణ్ తెలుగు సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడేనా?

అల్లు అర్జున్ రాకా మూవీ రిలీజ్ ఆల‌స్యం కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ తెలుగు మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 2 డిసెంబ‌ర్ 2027న ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ థియేట‌ర్ల‌లోకి రానుంద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Jun 12, 2026, 3.18 pm IST

Deepika Padukone |  అల్లు అర్జున్ ‘రాకా’ ఆలస్యం …  దీపికా పడుకోణ్ తెలుగు సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడేనా?
Advertisement

Deepika Padukone |  అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న రాకా మూవీ కోసం పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేష‌న్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా తెర‌కెక్కుతోన్న రాకాలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నో కాంప్ర‌మైజ్‌...

ఇటీవ‌లే రాకా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను మేక‌ర్స్‌ రిలీజ్ చేశారు.ఈ టైటిల్‌తోనే నేష‌న‌ల్ వైడ్‌గా ఈ సినిమాపై బ‌జ్ ఏర్ప‌డింది. రాకా వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే సినిమా రిలీజ్ ఆల‌స్యం కానుంద‌ట‌. గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ హంగుల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మున్న సినిమా ఇద‌ట‌. ఈ సీజీ వ‌ర్క్ కోసం ప‌లు హాలీవుడ్ స్టూడియోల‌తో మేక‌ర్స్ డీల్ కుదుర్చుకున్నార‌ట‌. ఇటీవ‌ల కాలంలో గ్రాఫిక్స్ సినిమాల‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ ఆల‌స్య‌మైనా కానీ సీజీ విష‌యంలో మాత్రం కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌ని ఫిక్స‌య్యార‌ట‌.

ఇయ‌ర్ ఎండ్‌లో...

2027 ప్ర‌థ‌మార్థంలో కాకుండా ఇయ‌ర్ ఎండ్‌లో రాకా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ట‌. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 2027 డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఇదే డైట్ ఫైన‌ల్ అని స‌మాచారం.సినిమా షూటింగ్ మాత్రం ఈ ఏడాది చివ‌రిక‌ల్లా కంప్లీట్ కానుంద‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఏడాది పాటు స‌మ‌యం తీసుకోనున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌లో అల్లు అర్జున్ సగం మ‌నిషి, స‌గం జంతువు ఆకారంలో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఏ హీరో చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

క‌ల్కి త‌ర్వాత‌....

రాకా మూవీలో దీపికా ప‌డుకోణ్ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ట‌. వారియ‌ర్ త‌ర‌హాలో ఆమె పాత్ర సాగుతుంద‌ని అంటున్నారు. క‌ల్కి 2898 ఏడీ త‌ర్వాత దీపికా ప‌డుకోణ్ న‌టిస్తోన్న తెలుగు మూవీ ఇది. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో రాకా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ ద్వారానే దీపికా పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేయ‌నున్నట్లు సమాచారం.  ఈ సినిమాలో దీపిక‌తో పాటు ర‌ష్మిక మంద‌న్న‌, జాన్వీ క‌పూర్‌, మృణాల్ ఠాకూర్ కూడా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Advertisement
Advertisement