త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raaka | రాక వ‌చ్చేశాడు..! అల్లు అర్జున్‌-అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్‌..!

P

Entertainment | Published On Apr 8, 2026, 12.07 pm IST

Raaka | రాక వ‌చ్చేశాడు..! అల్లు అర్జున్‌-అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్‌..!
Advertisement

Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ కాంబోలో వ‌స్తున్న మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానుల‌కు మేక‌ర్స్ గిఫ్ట్‌గా మూవీ నేమ్‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటు ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు. #AA22 క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాక’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా భ‌యంక‌ర‌మైన అవ‌తారంలో క‌నిపించ‌డం విశేషం. ఓ మనిషి జంతువుగా మారే ‘వేర్-బీస్ట్’ కాన్సెప్ట్‌తో ఈ లుక్‌ను రెడీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బన్నీ లుక్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. ​తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, అల్లు అర్జున్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ‘రాక’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ప్ర‌స్తుతం రాక మేనియా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. బ‌న్నీ కెరీర్‌లో ఈ మూవీ ప్ర‌యోగాత్మ‌కంగా నిలువ‌నుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే, మృణాల్‌ ఠాకూర్, రష్మిక మంద‌న్నా, జాన్వీ కపూర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లుగా స‌మాచారం. రూ.700 కోట్లకుపైగా వ్య‌యంతో భారీ ప్రాజెక్ట్‌ని స‌న్‌పిక్చ‌ర్ తెర‌కెక్కిస్తోంది. ఈ మూనీ 2027లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. మ‌రో వైపు లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ మూవీలో న‌టించ‌నున్నారు. అలాగే, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ మూవ తెర‌కెక్క‌నుంది. అలాగే, పుష్ప‌-3 ర్యాంపేజ్ లైన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sun Pictures (@sunpictures)

 

Advertisement

తాజావార్తలు

Advertisement