త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh – Balakrishna | సేమ్ స్టోరీతో టాలీవుడ్ టాప్ హీరోలు చేసిన సినిమాలు … ఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్‌

ఒకే క‌థ‌తో వ‌చ్చిన తెలుగు సినిమాలు ధ్రువ న‌క్ష‌త్రం, అశోక చ‌క్ర‌వ‌ర్తి ఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం అప్పట్లో వివాదానికి దారితీసింది. ధ్రువ న‌క్ష‌త్రంలో వెంక‌టేష్ హీరోగా న‌టించ‌గా...అశోక చ‌క్ర‌వ‌ర్తిలో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా క‌నిపించాడు.

N

Entertainment | Published On Mar 29, 2026, 6.15 pm IST

Venkatesh – Balakrishna | సేమ్ స్టోరీతో టాలీవుడ్ టాప్ హీరోలు చేసిన సినిమాలు … ఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్‌
Advertisement

Venkatesh - Balakrishna |  ఇండ‌స్ట్రీలో కొత్త క‌థ‌ల‌తో సినిమాలు రావ‌డం చాలా అరుదు. ప్రేమ‌క‌థ‌లు, రివేంజ్ డ్రామాలు, మంచి చెడు మ‌ధ్య యుద్ధం, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు మ‌రో నాలుగైదు కాన్సెప్ట్‌ల చుట్టే సినిమా క‌థ‌ల‌న్నీ తిరుగుతుంటాయి. రొటీన్ పాయింట్స్‌ను డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లే, ట్రీట్‌మెంట్‌తో వెండితెర‌పై ఆవిష్క‌రిస్తుంటారు ద‌ర్శ‌కులు. ఓ హీరో సినిమాను పోలిన క‌థ‌తో మ‌రో హీరో సినిమా చేయ‌డంలాంటివి త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఒకే క‌థ‌తో ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ హీరోలు చేసిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అప్ప‌ట్లో వివాదానికి దారితీసింది. ఆ హీరోలు బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌. వారిద్ద‌రు న‌టించిన ఆ సినిమాలు అశోక చ‌క్ర‌వ‌ర్తి, ధ్రువ న‌క్ష‌త్రం...

సేమ్ డే రిలీజ్‌...

1989 జూన్ 29న వెంక‌టేష్ ధ్రువ న‌క్ష‌త్రం, బాల‌కృష్ణ అశోక చ‌క్ర‌వ‌ర్తి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ధ్రువ న‌క్ష‌త్రం సినిమాకు వై నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా...అశోక చ‌క్ర‌వ‌ర్తికి ఎస్ ఎస్ ర‌విచంద్ర డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ రెండు సినిమాలు మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ఆర్య‌న్ ఆధారంగానే తెర‌కెక్కాయి. రిలీజ‌య్యే వ‌ర‌కు రెండింటి క‌థ ఒక‌టేన‌ని ఫ్యాన్స్‌కు తెలియ‌దు. థియేట‌ర్ల‌లో సినిమా చూసిన ఫ్యాన్స్ షాక‌య్యారు.

వెంకటేష్ సినిమా హిట్...

ఓ సాధార‌ణ యువ‌కుడు పెద్ద డాన్‌గా ఎలా మారాడు? అందుకు దారితీసిన ప‌రిస్థితులేమిట‌నే పాయింట్స్‌తో మాస్‌, యాక్ష‌న్ అంశాల‌తో ద‌ర్శ‌కులు ఈ సినిమాను రూపొందించారు. ఈ రెండు సినిమాల్లో బాల‌కృష్ణ అశోక చ‌క్ర‌వ‌ర్తి ఫ్లాప్ కాగా...వెంక‌టేష్ ధ్రువ న‌క్ష‌త్రం మాత్రం పెద్ద హిట్ట‌య్యింది. ఈ రెండు సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌, మాట‌లు అందించ‌డం గ‌మ‌నార్హం. ధ్రువ‌న‌క్ష‌త్రంలో ర‌జిని హీరోయిన్‌గా న‌టించ‌గా...అశోక చ‌క్ర‌వ‌ర్తిలో భానుప్రియ క‌థానాయిక‌గా క‌నిపించింది. అప్ప‌ట్లో ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పోరు వివాదానికి దారితీసింది.అశోక చక్రవర్తి సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయినా ఇందులోని పాట‌లు మాత్రం పెద్ద హిట్ట‌య్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement