Pujita Ponnada | లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు బ్యూటీ.. వెంకీమామ సినిమాలో పూజిత..!
Pujita Ponnada | విక్టరీ వెంకటేశ్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తెలుగు బ్యూటీ పూజిత పొన్నడకు కీలక అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కథకు మలుపు తిప్పేలా ఉంటుందని టాక్. నారా రోహిత్‌కు జోడీగా కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.
Entertainment | Published On Apr 29, 2026, 1.07 pm IST
Pujita Ponnada | విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ తెరక్కెక్కుతోంది. చాలాకాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓ కీలకపాత్రలో కనిపించనుందని, ఈ వైజాగ్ బ్యూటీ పాత్ర కథలో కీలక మలుపుతిప్పేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో నారా రోహిత్‌కు జోడీగా కనిపిస్తుందనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలకు కూడా బలం ఉండటంతో పూజిత కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి లీడ్‌రోల్‌లో కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వాస్తవానికి ఈ మూవీలో ఈ వేసవిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా మూవీ రిలీజ్ వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తనకు ప్రత్యేకమైన శైలిలో స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టుతున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక-హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వెంకటేశ్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ మంచి ఆదరణ ఉంటుంది. త్రిక్రమ్ డైలాగ్స్ స్టయిల్ కలిస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషనల్‌లో వచ్చిన నువ్వు నాకునచ్చావ్ మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి కుటుంబ వినోదంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తిని పెంచుతోంది. రిలీజ్ డేట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పూజిత పొన్నాడ స్వస్థలం విశాఖపట్నం. తొలుత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ కంటెంట్ గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. 2016లో ఊపిరి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ మెరిసింది. రంగస్థలం, కల్కి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, హరిహర వీరమల్లు వంటి చిత్రాల్లో కనిపించిన పూజిత.. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఆమె, తరచూ ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో భగవాన్ చిత్రంలో నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



