త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh Wedding Reception | ఆహ్వానం లేకుండా రావొద్దు – విరోష్ రిసెప్ష‌న్‌కు పోలీసుల ఆంక్ష‌లు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వెడ్డింగ్ రిసెప్ష‌న్ మార్చి 4న జ‌రుగ‌నుంది. ఈ రిపెప్ష‌న్ వేడుక‌కు ప‌లువురు రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకాబోతున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఆహ్వానం లేకుండా రావ‌ద్దొని విజ‌య్‌, ర‌ష్మిక టీమ్ పేర్కొన్నారు.

N

Entertainment | Published On Mar 1, 2026, 6.30 pm IST

Virosh Wedding Reception | ఆహ్వానం లేకుండా రావొద్దు – విరోష్ రిసెప్ష‌న్‌కు పోలీసుల ఆంక్ష‌లు
Advertisement

Virosh Wedding Reception | విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో వీరి వివాహ వేడుక జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. విరోష్ జోడీ రిసెప్ష‌న్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. మార్చి 4న హైద‌రాబాద్‌లో ఈ రిపెప్ష‌న్ వేడుక జ‌రుగ‌నుంది. ఈ రిసెప్ష‌న్‌కు వివిధ భాష‌ల‌కు చెందిన సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు హాజ‌రుకాబోతున్నారు. పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గెస్టుల క్షేమంతో పాటు రిసెప్ష‌న్ వేడుక స‌జావుగా సాగేందుకు అన్ని విధాలుగా స‌హ‌క‌రించాల‌ని కోరారు. పోలీసుల‌ ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ టీమ్‌ కూడా కోరుతున్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ విజ‌య్‌, ర‌ష్మికల‌కు ఉంటాయ‌ని వారి టీమ్‌ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు.విజ‌య్, ర‌ష్మిక‌ల‌కు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణాదితో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఈ వేడుక‌లో పాల్గొన‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement