త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు – ఫ‌స్ట్ హీరోయిన్‌గా రికార్డ్‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ ఇండియా సంస్థ ఉమెన్స్ ప‌వ‌ర్ 2026 అవార్డుల‌ను అంద‌జేసింది. ఇందులో ది ప‌వ‌ర్ ఆఫ్ షీ పుర‌స్కారాన్ని త‌మ‌న్నా స్వీక‌రించింది. ఈ అవార్డును అందుకున్న ఫ‌స్ట్ హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On May 25, 2026, 6.00 pm IST

Tamannaah | మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు – ఫ‌స్ట్ హీరోయిన్‌గా రికార్డ్‌
Advertisement

Tamannaah |  మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్రెస్టిజీయ‌స్ అవార్డును అందుకుంది. ఫోర్బ్స్ ఇండియా సంస్థ ఉమెన్స్ ప‌వ‌ర్ 2026 అవార్డుల‌ను ప్ర‌దానం చేసింది. ఇందులో ది ప‌వ‌ర్ ఆఫ్ షీ పుర‌స్కారాన్ని త‌మ‌న్నా అందుకుంది. సినిమాల‌తో పాటు వ్యాపార‌వేత్త‌గా రాణిస్తున్నందుకుగాను ఫోర్బ్స్ ఇండియా ఆమెకు ఈ పుర‌స్కారాన్ని అంద‌జేసింది. ఈ అవార్డును అందుకున్న ఫ‌స్ట్ హీరోయిన్‌గా త‌మ‌న్నా నిలిచింది. త‌మ‌న్నా ఈ అవార్డును స్వీక‌రిస్తున్న ఫొటోను ఫోర్బ్స్ ఇండియా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది.

బిజినెస్ ఉమెన్‌గా...

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియ‌న్ హీరోయిన్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మ‌రోవైపు బిజినెస్ఉమెన్‌గా రాణిస్తోంది. ఫైన్ జ్యూవెల్ల‌రీ పేరుతో సొంతంగా బ్రాండ్‌ను నెల‌కొల్పింది. జ్యూవెల్ల‌రీ బిజినెస్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. రెండు రంగాల్లో ఆమె సాధించిన విజ‌యాల‌ను గుర్తుగా ది ప‌వ‌ర్ ఆఫ్ షీ అవార్డు కోసం త‌మ‌న్నాను ఎంపిక‌చేసిన‌ట్లు ఫోర్బ్స్ ఇండియా ప్ర‌క‌టించింది.

ఐటెంసాంగ్స్‌లో.....

హీరోయిన్‌గానే కాకుండా ఐటెంసాంగ్స్‌తో కూడా త‌మ‌న్నా అద‌ర‌గొడుతోంది. జైల‌ర్‌, స్త్రీ 2, రైడ్ 2, కేజీఎఫ్‌తో పాటు ప‌లు సినిమాల్లో త‌మ‌న్నా చేసిన స్పెష‌ల్ సాంగ్స్ పెద్ద హిట్ట‌య్యాయి.

ప్ర‌స్తుతం ఆరు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది త‌మ‌న్నా. త‌మిళంలో విశాల్‌తో పురుష‌న్ సినిమా చేస్తోంది. హిందీలో వ్వాన్‌, శాంతారం బ‌యోపిక్‌, రాగిణి 3తో పాటు మ‌రో రెండు సినిమాలు అంగీక‌రిస్తోంది.

 

Advertisement
Advertisement