Tripti Dimri | ఓటీటీలోకి త్రిప్తి డిమ్రి, తమన్నా బాలీవుడ్ మూవీ – నెల రోజుల ముందే రిలీజ్ డేట్ రివీల్
త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ఓ రోమియో ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. మార్చి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Mar 2, 2026, 10.13 am IST
Tripti Dimri | యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ఓ రోమియో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. రిలీజ్‌కు నెల రోజులు ఉండగానే మేకర్స్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌ను రివీల్ చేశారు. మార్చి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తొలుత రెంటల్ విధానంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఫ్రీ స్ట్రీమింగ్‌కు ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
తమన్నా, దిశా పటానీ...
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఓ రోమియోలో షాహిద్‌కపూర్ హీరోగా నటించాడు. తమన్నా, విక్రాంత్ మాస్సే, దిశా పటానీ నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించారు. విశాల్ భరద్వాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఓ రోమియో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. కమర్షియల్‌గా నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకుంది.
మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి...
హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి నవల ఆధారంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. 1990లో ముంబాయిలో మాఫియా డాన్స్‌గా చెలామణి అయిన హుస్సేన్ ఉస్తారా, సప్నా దీదీ జీవితాల స్ఫూర్తితో ఈ మూవీ రూపొందినట్లు ప్రచారం జరిగింది. అప్షాన్ (త్రిప్తి డిమ్రి) ఓ ధైర్యవంతురాలైన మహిళ. అనుకోని పరిస్థితుల్లో భర్తతో (విక్రాంత్ మాస్సే) కలిసి క్రైమ్ వరల్డ్‌లోకి ఎంటరవుతుంది. ఆమె భర్తను గ్యాంగ్‌స్టర్ జలాల్ దారుణంగా హత్య చేస్తాడు. జలాల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన అప్షాన్ ఇందుకోసం ఉస్తారా ( షాహిద్ కపూర్) సాయం కోరుతుంది. అప్షాన్ కోసం జలాల్‌ను ఎదురించిన ఉస్తారాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అప్షాన్, ఉస్తారా మధ్య ఉన్న సంబంధమేమిటి అన్నదే ఈ మూవీ కథ. బాలీవుడ్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన త్రిప్తి డిమ్రి ఫస్ట్ టైమ్ ఈ మూవీలో డీ గ్లామర్ రోల్ చేసింది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలకు న్యాయం చేయగలదని ఈ సినిమాతో నిరూపించుకుంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీతో బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేస్తోంది. సందీప్ వంగా డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






