Jani Master | జానీ మాస్టర్ బ్యాన్‌పై ట్విస్ట్ – రెండు రోజుల్లోనే ఫెడరేషన్ యూటర్న్
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం కారణంగా జానీ మాస్టర్‌పై ఇటీవలే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జీవిత కాల నిషేధం విధించింది. బ్యాన్ విధించి రెండు, మూడు రోజులు కాకముందే ఫెడరేషన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Entertainment | Published On Jul 19, 2026, 9.11 pm IST
Jani Master | తెలుగు సినీ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవలు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. ఈ వివాదం కారణంగా జానీ మాస్టర్‌పై తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ లైఫ్ టైమ్ బ్యాన్ విధించింది. జానీ మాస్టర్ పనిచేస్తోన్న సినిమాలకు సంబంధించి అతడికి ఎలాంటి సహకారం అందించకూడదని నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్‌పై జీవితకాలం నిషేధం విధించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ట్విస్ట్....
బ్యాన్ విధించి రెండు రోజులు కూడా కాకముందే ఫెడరేషన్ సభ్యులు ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టాలీవుడ్‌లోని మిగిలిన సంఘాలు ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీలో జానీ మాస్టర్‌తో పాటు డ్యాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జానీ మాస్టర్ భార్య సుమలత, సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.
బాలకృష్ణ చొరవ...
ఫెడరేషన్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జానీ మాస్టర్ వెనక్కి తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎంప్లాయిస్ ఫెడరేషన్ అతడిపై విధించిన జీవితకాల నిషేదాన్ని ఎత్తేసింది. అంతే కాకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదం కూడా ఈ సమావేశంలో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. జానీ మాస్టర్‌తో పాటు ఇతర సభ్యుల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలను హీరో బాలకృష్ణ చొరవ తీసుకొని పరిష్కరించినట్లు సమాచారం.
ఉప ఎన్నికల కారణంగా...
అసోసియేషన్‌లోని మేనేజర్లు డ్యాన్సర్లను దోచుకుంటున్నారని సుమలతతో పాటు జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు అధ్యక్షురాలిగా ఉన్న సుమలత ఏకపక్ష నిర్ణయాలు వల్ల కొందరు సభ్యులు రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. రాజీనామా చేసిన స్థానాలకు సుమలత ఉప ఎన్నికలు ప్రకటించడంతో వివాదం ముదిరింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | హిట్ అండ్ రన్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్
సెప్టెంబర్ 1, 2026

Tollywood | డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదిరిన వివాదం – జానీ మాస్టర్ భార్యకు పోటీగా కొత్త కార్యవర్గం – సుమలత రియాక్షన్
సెప్టెంబర్ 1, 2026

Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
- ●Rashmika Mandanna | మైసా ఆగమనం అప్పుడే - నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో రష్మిక డబుల్ ట్రీట్
- ●Sugar Storage | చక్కెర నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్లకు కొత్త పరిమితి
- ●CJP protest Delhi | ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి
- ●MLA Prashanth Reddy | కాంగ్రెస్‌తో మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నా.. కవిత చెప్పగలరా?
- ●PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!

Rashmika Mandanna | మైసా ఆగమనం అప్పుడే - నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో రష్మిక డబుల్ ట్రీట్

Sugar Storage | చక్కెర నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్లకు కొత్త పరిమితి

CJP protest Delhi | ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి



