Elnaaz Norouzi | దేశానికి వ్యతిరేకం కాదు.. ప్రభుత్వానికి మాత్రమే..! ఇరాన్‌పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్..!
Elnaaz Norouzi | సినిమా ప్రపంచం హద్దుల్లేని, సృజనాత్మకతకు అంతులేని అద్భుతమైన రంగమని పేరుంది. ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వారంతా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మరో ప్రాంతానికి వెళ్తుంటారు. ఇలా ఎంతో మంది తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు భారతీయ సినిమాల్లోకి వచ్చారు. ఇందులో ఒకరు ఇరాన్ బ్యూటీ ఎల్నాజ్ నౌరోజీ.
Entertainment | Published On Mar 4, 2026, 4.00 pm IST
Elnaaz Norouzi | సినిమా ప్రపంచం హద్దుల్లేని, సృజనాత్మకతకు అంతులేని అద్భుతమైన రంగమని పేరుంది. ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వారంతా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మరో ప్రాంతానికి వెళ్తుంటారు. ఇలా ఎంతో మంది తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు భారతీయ సినిమాల్లోకి వచ్చారు. ఇందులో ఒకరు ఇరాన్ బ్యూటీ ఎల్నాజ్ నౌరోజీ. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆ దేశంపై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ప్రభుత్వ అధికారులను మట్టుబెట్టింది. ఖమేనీ హతమయ్యాక సోషల్ మీడియా లోపలి వీడియోలు షేర్ చేసిన ఆమె, సంబరాలు చేసుకుంటూ వార్తల్లో నిలిచింది.
ఇరాన్‌లో పుట్టిన ఎల్నాజ్ యూరప్‌లో పెరిగింది. ప్రస్తుతం భారతీయ సినిమాల్లో నటిస్తుంది. అయితే, సొంత దేశంలో పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను దేశానికి వ్యతిరేకం కాదని.. ప్రస్తుత పాలక ప్రభుత్వానికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు తాను ఇరాన్‌కు తిరిగి వెళ్లలేని స్పష్టం చేసింది. బాంబే టైమ్స్‌తో మాట్లాడిన ఎల్నాజ్.. ‘ఇరాన్ అంటే ఇస్లామిక్ రిపబ్లిక్. ప్రజలను వేరు చూడాలి. ఎక్కువ మంది ఇరానీయులు తెలివిగలవారు. విద్యార్హులు, వారి నమ్మకాలు ప్రభుత్వానికి భిన్నంగా ఉంటాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్‌కు మధ్య మంచి సంబంధాలుండేవి. షాహ్ మోహమ్మద్ రెజా పహ్లవి కాలంలో అమెరికాతో కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ మాత్రమే ఇజ్రాయెల్‌ను మ్యాప్ నుంచి తొలగించాలని చెబుతోంది. ఇటీవల నిరసన చేపట్టిన ఇరానీయులను హతమయ్యారు’ అని వివరించింది. అయితే, కుర్దిష్ ఇరానియన్ మహిళ 2022లో మహ్సా అమిని మరణం తర్వాత ఇరాన్‌లో ఉద్యమంతో తన కుటుంబం భయపడిందని.. ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తే దళాలు ప్రజలను నిర్బంధించాయని వాపోయింది. ఆ సమయంలో తాను సైతం ఖమేనీ ప్రభుత్వాన్ని విమర్శించానని.. ఇప్పుడు ఇరాన్‌కి తిరిగి వెళ్లడమంటే ప్రాణాలు కోల్పోవడమేనని వ్యాఖ్యానించింది.
ఎల్నాన్ 1991లో ఇరాన్‌లో జన్మించింది. ఎనిమిదేళ్ల వయసులో కుటుంబంతో కలిసి జర్మనీకి వెళ్లింది. అక్కడ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తన 20వ ఏటా భారత సినీరంగంలోకి ఎంట్రీ చేసింది. 2018లో పంజాబీ సినిమాలో నటించింది. హిందీలోనూ పలు సినిమాల్లోనూ నటించింది. 2023లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన డెవిల్ మూవీలోనూ నటించింది. ముఖ్యంగా ‘సాక్రేడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది ప్రశంసలు అందుకుంది. 2023లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాందహార్‌లో జెరార్డ్ బట్లర్, అలీ ఫజాల్‌తో నటించింది. ప్రస్తుతం వీల్ ఆఫ్ ఫార్చూన్‌లో కనిపిస్తోంది. దీనికి అక్షయ్ కుమార్‌తో కో-హోస్ట్‌గా కొనసాగుతున్నారు.
Read Also :
Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్
OTT | గంటకు నాలుగు రూపాయలే మాకు మిగిలేది – గుప్పెడంత మనసు రిషి డెబ్యూ మూవీ దర్శకుడి ట్వీట్
Rashi Khanna | జీవితం ఎటు తీసుకువెళ్తే అటే.. సినీ కెరీర్‌పై రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



