OTT | గంటకు నాలుగు రూపాయలే మాకు మిగిలేది – గుప్పెడంత మనసు రిషి డెబ్యూ మూవీ దర్శకుడి ట్వీట్
కన్నడ మూవీ తీర్థరూప తండేయావరిగేతో గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కన్నడ మూవీ ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
Entertainment | Published On Mar 3, 2026, 8.29 pm IST
OTT | గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ముఖేష్ గౌడ. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్‌లో రషి పాత్రలో కనిపించాడు. తల్లి ప్రేమ కోసం పరితపించే కొడుకుగా, లవర్‌బాయ్‌గా, కాలేజీ హెడ్‌గా మల్టీపుల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో అదరగొట్టాడు. ఇటీవలే ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మాతృభాష కన్నడంలో తీర్థరూప తండేయావరిగే పేరుతో ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ చేశాడు. హీరో డెబ్యూ కోసం తన పేరును నిహార్ ముఖేష్‌గా మార్చుకున్నాడు. రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించాడు. తీర్థరూప తండేయావరిగే సినిమాలో ముఖేష్ గౌడతో పాటు సితార, రవీంద్ర విజయ్, రచన ఇందర్ కీలక పాత్రల్లో నటించారు.
ఓటీటీలోకి...
ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మూడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
డైరెక్టర్ ట్వీట్...
ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై దర్శకుడు రామేనహల్లి జగన్నాథ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తీర్థరూప తండేయావరిగే సినిమాను అమెజాన్ ప్రైమ్‌లోనే చూడాలని ఈ ట్వీట్‌లో దర్శకుడు పేర్కొన్నారు. పైరసీలో చూడొద్దని రిక్వెస్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూస్తే గంటకు నాలుగు రూపాయలే మాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ చెల్లిస్తుందని, ఆ డబ్బులే మాకు ఆధారమని తన ట్వీట్‌లో రామేనహల్లి జగన్నాథ పేర్కొన్నాడు. పే ఫర్ వ్యూ పద్దతిలో అమెజాన్ ప్రైమ్ తమ సినిమాను కొనుగోలు చేసిందని అన్నాడు.థియేటర్లలో రిలీజైన సమయంలో ప్రమోషన్స్ చేయడానికి తమ దగ్గర డబ్బులు లేవని, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడానికి అదే కారణమని అన్నారు.
ప్రియమైన నాన్నకు...
ముఖేష్ గౌడకు తెలుగులో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ప్రియమైన నాన్నకు పేరుతో టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయాలని అనుకున్నారు. టైటిల్ ప్రకటించారు. కానీ కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజైంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






