త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఓటీటీలోకి దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత మూవీ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

Kantha OTT | దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salmaan), భాగ్య‌శ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోహీరోయిన్లుగా న‌టించిన కాంత (Kaantha) మూవీ ఓటీటీలోకి వ‌స్తుంది. డిసెంబ‌ర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కాంత మూవీలో రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

N

Entertainment | Published On Dec 8, 2025, 9.50 am IST

ఓటీటీలోకి దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత మూవీ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

కాంత ఓటీటీ

Advertisement

Kaantha OTT | దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salmaan) హీరోగా న‌టించిన‌ లేటెస్ట్ మూవీ కాంత (Kaantha) డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను అందుకుంది. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన విజ‌యాన్ని సాధించ‌లేదు. తాజాగా పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఓటీటీలోకి వ‌స్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో...
డిసెంబ‌ర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) కాంత మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ మూవీ అందుబాటులోకి రాబోతుంది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే కాంత ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం గ‌మ‌నార్హం.
కాంత మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా న‌టించింది. రానా ద‌గ్గుబాటి, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లు పోషించారు. కాంత మూవీకి సెల్వ‌మ‌ణిసెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
ఈ పీరియాడిక‌ల్ మూవీని రానా ద‌గ్గుబాటితో క‌లిసి దుల్క‌ర్ స‌ల్మాన్ స్వ‌యంగా నిర్మించారు. కానీ ఈ ఇద్ద‌రు హీరోల‌కు కాంత మూవీ న‌ష్టాల‌ను మిగిల్చింది.
ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయినా దుల్క‌ర్ స‌ల్మాన్, భాగ్య‌శ్రీ బోర్సే యాక్టింగ్ మాత్రం అద్భుత‌మంటూ క్రిటిక్స్ తో పాటు ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. సినిమా ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్ కాంత‌ క‌థ‌ను రాసుకున్నారు. కోలీవుడ్ ఫ‌స్ట్ సూప‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న త్యాగ‌రాజ భ‌గ‌వ‌తార్ జీవితం ఆధారంగా కాంత మూవీ తెర‌కెక్కిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. భ‌గ‌వ‌తార్ జీవితాన్ని వ‌క్రీక‌రించారంటూ ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కాంత మేక‌ర్స్‌పై కేసు పెట్టారు. కాన్సెప్ట్ బాగున్నా ప్రెడిక్ట‌బుల్ ట్విస్ట్‌లు, స్లోఫేజ్‌లో సాగే స్క్రీన్‌ప్లే కాంత‌కు మైన‌స్‌గా మారాయ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.
కాంత మూవీ క‌థ ఇదే?
హీరో టీకే మ‌హ‌దేవ‌న్‌( దుల్క‌ర్ స‌ల్మాన్‌)తో డైరెక్ట‌ర్ అయ్య (స‌ముద్ర‌ఖ‌ని) శాంత పేరుతో ఓ సినిమా తీయాల‌ని అనుకుంటాడు. ఈ సినిమా క్లైమాక్స్ విష‌యంలో మ‌హ‌దేవ‌న్‌, అయ్య మ‌ధ్య విభేదాలు మొద‌ల‌వుతాయి. వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు హీరోయిన్ కుమారి (భాగ్య‌శ్రీ బోర్సే) ప్ర‌య‌త్నిస్తుంటుంది. అనుకోకుండా సినిమా యూనిట్‌లోని ఓ స‌భ్యుడు హ‌త్య‌కు గుర‌వుతాడు. అనుమానితుల్లో మ‌హ‌దేవ‌న్‌తో పాటు అయ్య కూడా ఉంటారు. ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్స్‌పెక్ట‌ర్ దేవ‌రాజ్ (రానా ద‌గ్గుబాటి) ఎలా సాల్వ్ చేశాడు? మ‌హ‌దేవ‌న్‌తో అయ్య సినిమా పూర్తిచేశాడా? అన్న‌దే కాంత మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement