POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్‌ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
POCO M8x 5G | షియోమీకి చెందిన మొబైల్స్ తయారీ సబ్ బ్రాండ్ సంస్థ పోకో భారత మార్కెట్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ పోకో ఎం8ఎక్స్ 5జిని విడుదల చేసింది. ఎంట్రీ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ విభాగ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, ప్రత్యేకమైన హీట్ మేనేజ్‌మెంట్, పవర్‌ఫుల్ డిస్‌ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.
Technology | Published On Aug 22, 2026, 4.33 pm IST
POCO M8x 5G | షియోమీకి చెందిన మొబైల్స్ తయారీ సబ్ బ్రాండ్ సంస్థ పోకో భారత మార్కెట్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ పోకో ఎం8ఎక్స్ 5జిని విడుదల చేసింది. ఎంట్రీ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ విభాగ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, ప్రత్యేకమైన హీట్ మేనేజ్‌మెంట్, పవర్‌ఫుల్ డిస్‌ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ ప్రాసెసర్ కలిగిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 6జీబీ, 12జీబీ ర్యామ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6జీబీ వరకు అదనంగా పెంచుకునే వీలు కల్పించారు.
కూలింగ్ సిస్టమ్, భారీ బ్యాటరీ..
ఎక్కువసేపు ఉపయోగించినా ఫోన్ హీట్‌కు గురి కాకుండా ఉండేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా మల్టీ లేయర్ ట్రిపుల్ కూలింగ్ వ్యవస్థను ఇచ్చారు. ప్రత్యేకమైన గ్రాఫైట్ షీట్ ద్వారా ఉష్ణాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ బయటకు పంపిస్తుంది. దీంతో ఫోన్ ప్రాసెసర్, మదర్‌బోర్డ్, బ్యాటరీపై పడే భారం తగ్గుతుంది. అలాగే కూలింగ్ కోసం ప్రత్యేకమైన థర్మల్ జెల్‌ను అమర్చారు. దీంతో ఫోన్ చాలా తక్కువ హీట్‌కు గురవుతుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ పవర్ కాగా దీంట్లో 7900 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంతో ఈ ఫోన్ 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల ఫోన్‌ను 30 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తేనే ఒక రోజు ఉపయోగానికి సరిపడా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే దీంతో ఇతర డివైస్‌లను చార్జింగ్ చేసేందుకు ఇందులో ప్రత్యేకంగా 22.5 వాట్ల రివర్స్ చార్జింగ్ సదుపాయాన్ని కూడా ఇచ్చారు.
భారీ డిస్‌ప్లే..
ఈ ఫోన్‌లో 6.9 ఇంచుల డిస్‌ప్లే ఉండగా, దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఉన్నాయి. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌ను అందించారు. వాల్యూమ్‌ను 300 శాతం వరకు పెంచుకునేలా అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కూడా ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ ప్రధాన ఏఐ కెమెరాతోపాటు మరో 2 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇందులో షియోమీకి చెందిన ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్లను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ తెలిపింది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఆడియో జాక్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను అందించారు.
ధర ఎంతంటే..
పోకో ఎం8ఎక్స్ 5జి ఫోన్ గ్రీన్ రంగులో వేగన్ లెదర్ బ్యాక్‌తోపాటు కోబాల్ట్ బ్లూ, బ్లాక్ రంగుల్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ మోడల్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.22,999గా ఉంది. ఆగస్టు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ను విక్రయించనున్నారు. మొదటి రోజు విక్రయాల్లో రూ.2వేల కూపన్ డిస్కౌంట్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
తాజావార్తలు
- ●Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
- ●SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్
- ●Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
- ●Deepika Padukone | మళ్లీ తెరపైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపికా!
- ●Telecom Rules 2026 | కొత్త సిమ్ కార్డుకు బయోమెట్రిక్ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..
- ●Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ

Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం

SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్

Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు

Deepika Padukone | మళ్లీ తెరపైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపికా!





